Narne Nithin: లక్ష్మీ ప్రణతి సీక్రెట్స్ ను రివీల్ చేసిన నార్నె నితిన్.. అలా చెప్పడంతో?

నార్నె నితిన్ (Narne Nithin) మ్యాడ్ (MAD)   సినిమాలో అశోక్ రోల్ లో నటించి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. సితార బ్యానర్ పై పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన మ్యాడ్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది. ఆయ్ (AAY) సినిమాతో నార్నె నితిన్ ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పరిమిత బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా నార్నె నితిన్ ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Narne Nithin

గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా నార్నె నితిన్ అక్క లక్ష్మీ ప్రణతి గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. అక్క లక్ష్మీ పణతి రిజర్వ్డ్ గా ఉంటారని నార్నె నితిన్ అన్నారు. నేను తమ్ముడిని కాబట్టి అక్కకు నాకు మధ్య క్రేజీ బాండింగ్ ఉంటుందని నితిన్ చెప్పుకొచ్చారు. అక్క ఎవరితో ఎక్కువగా మాట్లాడరని కలవరని నితిన్ కామెంట్లు చేయడం గమనార్హం.

లక్ష్మీ ప్రణతి ఇప్పటివరకు మీడియాకు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సోషల్ మీడియాకు సైతం లక్ష్మీ ప్రణతి దూరంగా ఉంటారు. తారక్ కెరీర్ విషయంలో సైతం ఆమె అస్సలు జోక్యం చేసుకోరని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. నార్నె నితిన్ ఒక విధంగా లక్ష్మీ ప్రణతి బిహేవియర్ కు సంబంధించిన సీక్రెట్స్ ను రివీల్ చేశారు. ఎన్టీఆర్  (Jr NTR)  లక్ష్మీ ప్రణతిలను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

లక్ష్మీ ప్రణతి కుటుంబానికి సంబంధించిన బాధ్యతలను పర్ఫెక్ట్ గా నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. లక్ష్మీ ప్రణతి రాబోయే రోజుల్లో అయినా సోషల్ మీడియా విషయంలో అభిప్రాయాలను మార్చుకుంటారేమో చూడాలి. మరోవైపు నార్నె నితిన్ ఆయ్ సినిమాతో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది. ఈ సినిమా ఒకింత ఎక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది.

 ‘లైగర్’ రిలీజ్ తర్వాత పూరీకి రాజమౌళి తండ్రి ఫోన్.. ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus