@నర్తనశాలకు ఇక పోటీ లేనట్టే!

కృష్ణవంశీ వద్ద అనేక సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస చక్రవర్తి తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా @నర్తనశాల. ఐరా క్రియేషన్స్‌ బ్యానర్లో నిర్మితమైన ఈ మూవీలో యంగ్ హీరో నాగ శౌర్య విభిన్నంగా కనిపించబోతున్నారు. సొంత బ్యానర్లో చేసిన “ఛలో” సూపర్ హిట్ అవడంతో.. ఈ సినిమాకి 15 కోట్లు ఖర్చు చేశారు. యామిని భాస్కర్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడ మాత్రమే కాకుండా విశేషాల్లోనూ మంచి పబ్లిసిటీ చేస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతమందించిన ఈ మూవీ ఈనెల 30 న రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే ఆ తర్వాతి రోజే (ఈ నెల 31వ తేదీన) నాగచైతన్య, మారుతీ కాంబినేషన్లో తెరకెక్కిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్ కానుంది.

అందులో రమ్య కృష్ణ నటిస్తుండడంతో @నర్తనశాల టీమ్ కొంచెం ఆందోళనగానే ఉన్నింది. తప్పకుండా తమ కలక్షన్స్ పై శైలజ రెడ్డి అల్లుడు ప్రభావం చూపిస్తుందని భావించారు. కానీ కేరళ వర్షాలతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల ఆ సినిమా సెప్టెంబర్ 4 కి వాయిదా పడింది. దీంతో @నర్తనశాల జాక్ పాటు కొట్టేసింది. ఆల్ మోస్ట్ సోలో రిలీజ్ అవుతోంది. ఈ మధ్యకాలంలో చిన్న హీరోల సినిమాలకు ఇలా సోలో డేట్ లు దొరకడం చాలాకష్టం. ఆ అదృష్టం నాగ శౌర్య లభించింది. అందుకే పోటీ లేదు కాబట్టి కొంచెం బాగున్నా కలక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus