మన దేశంలో అత్యున్నత సినిమా పురస్కారం అంటే జాతీయ అవార్డులే. కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది. అలా గతేడాది అంటే 2021కి సంబంధించిన జాతీయ చలన చిత్ర పురస్కారాలను శుక్రవారం ప్రకటించనున్నారని సమాచారం. ఈ దఫా పురస్కారాల్లో ఏమవుతుంది, ఏ తెలుగు సినిమాకు ఉత్తమ పురస్కారం వస్తుంది అని వేచి చూస్తున్నారు అభిమానులు. మరి 2021కిగాను ఏ సినిమాలు బరిలో ఉన్నాయి, వాటికి అవకాశాలు ఎంతో ఓసారి చూద్దాం.
జాతీయ పురస్కారాల్లో తెలుగుకు మొండిచేయి చూపించడం గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. మరి ఆ స్థాయికి తగ్గ సినిమాలు మనం చేస్తున్నామా అంటే చేస్తున్నామనే చెప్పాలి. ఉత్తమ చిత్రం (తెలుగు) ఎలాగూ తెలుగు సినిమాకు ఇవ్వాలి కాబట్టి.. ఇస్తున్నారు అనే జోకులు కూడా వినిపిస్తుంటాయి. అయితే ఈ ఏడాది తెలుగు సినిమాను విస్మరించి జాతీయ ఉత్తమ చిత్రం ఎంచుకోవడం అంత ఈజీగా కాదు అంటున్నారు. కారణం ఈ ఏడాది బరిలో ఉన్న సినిమాలే. తెలుగు నుండి ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘జాతిరత్నాలు’, ‘శ్రీకారం’, ‘నాంది’, ‘సినిమా బండి’ లాంటివి ఉన్నాయి.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా 2022లో విడుదలైనా.. దాని సెన్సార్ 2021లో జరిగింది కాబట్టి ఆ ఏడాది బరిలో ఉంది. తారక్ – రాజమౌళి – రామ్‌చరణ్ ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం, సౌండ్ డిజైనింగ్, స్క్రీన్ ప్లే, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఈ సినిమా గట్టి పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్ – సుకుమార్ ‘పుష్ప’ కూడా బరిలో ఉంది అంటున్నారు. అయితే స్మగ్లింగ్‌ను ప్రోత్సిహించేలా (ఇప్పటివరకు) ఉన్న సినిమాకు పట్టం కడతారా అనేది చూడాలి.
ఇక గతేడాది చాలా వరకు మంచి సినిమాలు ఓటీటీలోనే వచ్చాయి. అవన్నీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కావు. చాలావరకు కొత్త ఆలోచనలు, కాన్సెప్ట్‌లతో రూపొందినవే. ఆ లెక్కన వాటికి కూడా పురస్కారాల అవకాశాలు ఉన్నాయి. తమిళం నుండి అయితే సూర్య ‘జై భీమ్’ సినిమాకు కచ్చితంగా పురస్కారం వస్తుంది అని అంటున్నారు. అయితే ఏటా ఇలా అనుకోవడం, ఏ మలయాళం సినిమా పురస్కారం కొట్టేయడం చూస్తున్నాం. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!