‘జెర్సీ’ షూటింగ్లో గాయపడ్డ నాని..!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ‘జెర్సీ’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. తాజాగా ఈ మూవీ షూటింగులో నాని గాయపడ్డాడు. చిత్రీకరణలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అందుతున్న సమాచారం ప్రకారం…. నాని ముక్కు భాగానికి గాయమైనట్లు తెలుస్తుంది. తగిలిన గాయం చిన్నదే.. కావడంతో సెట్స్‌లోనే చిన్న సర్జరీ నిర్వహించిన తరువాత.. నాని మళ్ళీ షాట్‌కు రెడీ అయ్యాడట.

‘మళ్ళీరావా’ వంటి డీసెంట్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో.. 1986-1996 స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో కనిపించబోతున్నాడు. 36 ఏళ్ళ వయసులో ఇండియన్ క్రికెట్ టీమ్‌లో చోటు దక్కించుకోవాలని ప్రయత్నించే ఓ వ్యక్తి కథ అని ఇటీవల విడుదలైన టీజర్ తో స్పష్టమవుతుంది. ”ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ… ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు” అంటూ సాగే.. ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి… అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19 న విడుదల కాబోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus