Navdeep: పెళ్లి గురించి స్పందించిన హీరో నవదీప్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సినీ హీరోలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉండగా మరి కొంతమంది మాత్రం ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే మిగిలిపోతున్నారు ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే టక్కున అందరికీ ప్రభాస్ గుర్తుకు వస్తారు. ఈయన తరువాత ఇదే జాబితాలో హీరో నవదీప్ కూడా ఉన్నారని చెప్పాలి. ఈయన కూడా పెళ్లి వయసు దాటిపోయిన పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదు.

ఇప్పటికే ఎన్నోసార్లు నవదీప్ పెళ్లి గురించి ప్రస్తావన రాగా ఈయన మాత్రం తాను పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పేశారు. తన ఇంట్లో కూడా నేను పెళ్లి చేసుకోనని చెప్పినప్పటికీ తరచూ తన తల్లి పెళ్లి గురించి తనని ప్రశ్నిస్తూ ఉంటుందని పలు సందర్భాలలో నవదీప్ వెల్లడించారు. తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా పెళ్లి గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా నవదీప్ మాట్లాడుతూ ఈరోజు పొద్దున్నే మా మదర్ ఇండియా నా పెళ్లి గురించి మాట్లాడింది. పెళ్లి చేసుకోవడం బ్యాడ్ అయితే పెళ్లి వర్కౌట్ కాకపోయి విడాకులు తీసుకున్నటువంటి వారు మరోసారి ఎందుకు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అంటూ తన తల్లి తనని ప్రశ్నించారని నవదీప్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే తన తల్లి అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదని ఈయన ఈ వీడియోలో తెలియచేశారు.

ఈ వీడియోని నవదీప్ (Navdeep) సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. జరగాలి పెళ్లి అని కూడా ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టాడు. దీంతో పెళ్లి గురించి ఇలా ఆలోచించి నవదీప్ కూడా పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి. ఇలా పెళ్లి గురించి నవదీప్ మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా తన తల్లి అడిగిన ప్రశ్నకు మీకు ఏదైనా సమాధానం తెలిసే ఉంటే కామెంట్ చేయండి అంటూ కూడా పలువురు ఈ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus