Navdeep: ‘సగిలేటి కథ’ ప్రమోషన్స్ లో పాల్గొన్న నవదీప్… డ్రగ్స్ కేసు పై ఏమన్నాడంటే?

  • October 12, 2023 / 02:39 PM IST

టాలీవుడ్ హీరో నవదీప్ పేరు మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్టు ప్రచారం గట్టిగా జరిగింది. ఈ క్రమంలో అతను పరారీలో ఉన్నాడనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్వయంగా నవదీప్ పేరు ప్రకటించడం అనేది చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వాడే కస్టమర్స్ లిస్ట్ లో నవదీప్ పేరు ఉండడం.. కొంతమంది పొలిటీషియన్స్ వారసులతో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించడం జరిగింది.

కానీ ‘పొలిటీషియన్స్ వారసుల పేర్లు అయితే ఆయన బయటకు చెప్పలేదు పోలీసులు’ అనే విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా.. అటు తర్వాత నవదీప్ మాత్రం.. తనకి ఆ కేసుతో సంబంధం లేదు అని ట్వీట్ వేసి షాక్ ఇచ్చాడు. అయితే మరోపక్క.. నవదీప్ పై అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యు అయినట్టు మరో టాక్ బయటకు వచ్చింది. ఆ టైంలో నవదీప్ ముందస్తు బెయిల్ కి అప్లై చేస్తూ కోర్టుకి ఎక్కడం కూడా జరిగింది.

ఇదిలా ఉండగా.. ఆ తర్వాత నవదీప్ (Navdeep) మీడియాలో ఎక్కువగా కనిపించింది లేదు. అయితే నిన్న ‘సగిలేటి కథ’ ప్రీమియర్ షోలో భాగంగా ఆయన మీడియా ముందుకి రావడం జరిగింది. ఆ టైంలో అతనికి నాన్ స్టాప్ గా డ్రగ్స్ కేసు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ నవదీప్ మాత్రం వాటికి సరైన సమాధానం చెప్పకుండా మాట దాటేశారు. ‘ప్రస్తుతానికి సినిమా గురించి మాట్లాడుకుందాం.. తర్వాత దాని గురించి మాట్లాడదాం’ అంటూ నవదీప్ ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus