Naveen Chandra, Balakrishna: బాలకృష్ణ పై నవీన్ చంద్ర కామెంట్స్ వైరల్…!

నంద‌మూరి బాల‌కృష్ణ పై విలక్షణ నటుడు నవీన్ చంద్ర చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. `బాల‌య్య లాంటి హీరోని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆయ‌న‌తో ప‌నిచేసిన రోజులు అద్భుతంగా గ‌డిచాయి. ఆయ‌న నాకు తెగ ముద్దొచ్చేశారు.ఆయన్ని ముద్దు పెట్టుకోవాలన్నంత ప్రేమ ఆయన పై నాకు కలిగింది.సెట్లో బాల‌య్య ఉగ్ర‌రూపం చూశాను. ఆయ‌న ఎన‌ర్జీ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. బ‌య‌ట ఆయ‌న గురించి చాలార‌కాలుగా మాట్లాడుకుంటారు.

కానీ.. ఆ బాలయ్య నిజం కాదు. నేను చూసిన బాల‌య్య పూర్తిగా వేరు. గోపీచంద్ గారి సినిమాలో బాలయ్య విశ్వ‌రూపం చూస్తారు. బాలయ్య లుక్, డైలాగ్ మాడ్యులేషన్, స్టైల్‌ నాకు బాగా న‌చ్చేశాయి. ఈ సినిమాలో నా పాత్ర గురించి అప్పుడే చెప్పను.నాలుగైదు పాత్రలు హైలెట్ గా నిలుస్తాయి.అందులో నాది కూడా ఒకటి’ అదొక్కటి మాత్రమే చెప్తాను’ అంటూ నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు. నిజ జీవితంలో బాలయ్య చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు..

కోపం వచ్చినా, ప్రేమ కలిగినా వెంటనే చూపించేస్తారు. అభిమానుల విషయంలో బాలయ్య ప్రవర్తించే తీరు ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. ఇక రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న `విరాట‌ప‌ర్వం`చిత్రంలో న‌వీన్ చంద్ర ఓ కీల‌క పాత్ర పోషించాడు.సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ‘విరాటపర్వం’ ప్రమోషన్లలో భాగంగానే బాలకృష్ణ గురించి నవీన్ చంద్ర ఈ కామెంట్స్ చేశారు.

ఒకప్పుడు హీరోగా తన కెరీర్ ను ప్రారంభించిన నవీన్ చంద్ర… ఎక్కువ కాలం హీరోగా రాణించలేకపోయాడు. ‘నేను లోకల్’ ‘అరవింద సమేత’ ‘దేవదాస్’ ‘గని’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు నవీన్ చంద్ర.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus