నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.
ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ తో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్ తో ఉండబోతోంది.
ఈ చిత్రంలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది.అజయ్ అరసాడ సంగీతం అందిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, నగేష్ బన్నెల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
హనీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది, ఇది మ్యాసీవ్ పోస్ట్-థియేట్రికల్ రీచ్‌ను ప్రామిస్ చేస్తోంది,
సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాల సమ్మేళనంతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు సిద్ధంగా ఉంది.
తారాగణం: నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై, దివి, రాజా రవీందర్, జయని, జయత్రి, తదితరులు
రచన, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి
బ్యానర్:OVA ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: అజయ్ అరసాడ
DOP: నగేష్ బన్నెల్
ఎడిటింగ్: మర్తాండ్ కె వెంకటేశ్
పీఆర్వో: తేజస్వీ సజ్జా