Naveen Polishetty: నవీన్‌ పొలిశెట్టి నటించిన సీరియల్‌ తెలుసా? విదేశీ సిరీస్‌లోనూ ఉన్నాడా?

నవీన్‌ పొలిశెట్టి  (Naveen Polishetty)  .. నేటి తరం యువ హీరోల్లో ఆయనో రకం. అవును కచ్చితంగా ఇదే మాట అనాలి. ఎందుకంటే ఒప్పుకుందాం అనే ఆలోచన చేయడానికే మన హీరోలు ఆలోచించే కథలను ఎంచుకుని ఊహించని విజయాలు అందుకుంటున్నారు. యాక్సిడెంట్‌ కారణంగా సినిమాలకు గ్యాప్‌ వచ్చింది కానీ.. మామూలుగా అయితే వరుస సినిమాలు చేసే రకం. తెలుగులో హీరో అయ్యే ముందు నవీన్‌ చాలా పనులు చేశాడు. అందులో సీరియల్‌ కూడా ఒకటి ఉంది. నవీన్‌ పొలిశెట్టి తొలినాళ్లలో ఓ సీరియల్‌లో నటించాడు.

Naveen Polishetty

అంతేకాదు కొన్ని వెబ్‌సిరీస్‌లు కూడా చేశాడు. అయితే ఇవన్నీ ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ (Agent Sai Srinivasa Athreya) చేసే ముందే. 2015 నుండి 2018 వరకు తొమ్మిది సిరీస్‌లు / సీరియల్స్‌లో నటించాడు. ఇందులో ‘24’ అనే సీరియల్‌ తెలుగులో డబ్బింగ్‌ కూడా అయింది. అయితే దానికి సరైన ఆదరణ దక్కలేదు. 2019లో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘చిచ్చోరే’ (Chhichhore) లాంటి సినిమాలు రావడంతో హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. అప్పటికే ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ (Life Is Beautiful) , ‘డి ఫర్‌ దోపిడీ’ (D for Dopidi) , ‘వన్‌: నేనొక్కడినే’ (1: Nenokkadine) సినిమాలు చేసినా అవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

ఇక ‘జాతి రత్నాలు’తో (Jathi Ratnalu) అయితే టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ అయిపోయాడు. ఆ వెంటనే అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చేసి విజయం అందుకున్నాడు. ‘అనగనగా ఒక రాజు’ అనౌన్స్‌ చేసినా ఇంకా పట్టాలెక్కలేదు. పైన చెప్పినట్లు తొమ్మిది సీరియల్‌ / సిరీసుల్లో ‘ఏఐబీ హానెట్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌’, ‘మస్తీ’, ‘ఏఐబీ ది డీమానిటైజేషన్‌ స్కస్‌’ ‘24’, ‘ఏఐబీ హానెస్‌ ఇంజినీరింగ్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌’, ‘ఉంతగ్‌’, ‘వాట్స్‌ యువర్‌ స్టేటస్‌’ ఉన్నాయి.

వీటితోపాటు ‘ఫైస్‌ పాస్‌ సీ’ అనే ఫ్రెంచ్‌ టీవీ సిరీస్‌లో కూడా కనిపించాడు. అందులో రెండు ఎపిసోడ్లలో నవీన్ పొలిశెట్టి ఉంటాడు. ఇదన్నమాట నవీన్‌ పొలిశెట్టి టాలెట్‌. ఏం చేస్తాం సరైన విజయం పడక ఇన్నాళ్లూ హైలైట్‌ అవ్వలేదు. అయ్యాడు అనుకుంటే యాక్సిడెంట్‌ ఇబ్బంది పెట్టింది.

నవీన్‌ పొలిశెట్టి నటించిన సీరియల్‌ తెలుసా? విదేశీ సిరీస్‌లోనూ ఉన్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus