మొత్తానికి నవీన్ పోలిశెట్టి క్లారిటీ ఇచ్చేసాడు…!

Advertisement

నవీన్ పోలిశెట్టి… ఈ పేరు వినగానే మనకి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్’ సినిమా గుర్తొస్తుంది. ఆ చిత్రంలో అతనికి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం నాలుగు రెట్లు లాభాలను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి ముందే నవీన్ పోలిశెట్టి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మరియు ‘డి ఫర్ దోపిడి’, మహేష్ – సుకుమార్ ల ‘1 నేనొక్కడినే’ వంటి చిత్రాల్లో కూడా నటించాడు.

మరోపక్క బాలీవుడ్ లో కూడా ‘చిచోరే’ వంటి చిత్రం చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా నవీన్ … నందమూరి బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రంలో నవీన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల పై తాజాగా నవీన్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ…”బాలకృష్ణ – బోయపాటి సినిమాకి సంబంధించి ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు.

ఈ సినిమాలో నేను నటిస్తున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అదంతా కేవలం పుకారు మాత్రమే” అంటూ చెప్పుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి.ప్రస్తుతం నవీన్ ‘జాతి రత్నాలు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అనుదీప్ కె.వి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నాడు. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం విడుదల కానుంది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus