Nayanatara: పెళ్లి తర్వాత వృత్తిపరమైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చిన నయన్!

  • June 20, 2022 / 10:17 AM IST

నయనతార దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ద్వారా నయనతార ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇకపోతే నయనతార వృత్తిపరమైన జీవితంలో అగ్ర తారగా గుర్తింపు పొంది మంచి విజయాలను అందుకున్నారు. ఇక ఈమె వ్యక్తిగత విషయానికొస్తే గతంలో తన ప్రేమలో విఫలమైన నయనతార చివరికి దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి ఎంతో ఘనంగా జూన్ 9వ తేదీ వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఈ విధంగా పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట కొన్ని రోజులపాటు వీరి వృత్తిపరమైన జీవితానికి విరామం ప్రకటించి వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని అందరూ భావించారు.ఇక నయనతార విషయానికొస్తే ఈమె పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతుందని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. నయనతార పెళ్లికి ముందు నిత్యం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడిపారు.అయితే ఈమె పెళ్లికి ముందు పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఆమె ఆ సినిమా షూటింగ్ లను పూర్తి చేయాల్సి ఉండగా పెళ్లి జరిగిన వెంటనే నయనతార పెళ్లికి ముందులా వరుస సినిమా షూటింగులతో బిజీ అవుతున్నారు.పెళ్లయిన వెంటనే నయనతార వ్యక్తిగత జీవితానికి కాకుండా వృత్తిపరమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తూ తప్పు చేస్తున్నారు అంటూ పలువురు భావిస్తున్నారు. నయనతార విగ్నేష్ కూడా పెళ్లికి ముందే కొన్ని సినిమాలకు కమిట్ కావడంతో వీరిద్దరు పెళ్లి అయిన వెంటనే వీరు వీరి వృత్తి పరమైన జీవితంలో బిజీ అయ్యారు.

నయనతార సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో కూడా నటించనున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus