Nayanatara: అలాంటి చిత్రాలకే నయనతార మొదటి ప్రాధాన్యత ఇవ్వనుందా?

  • June 13, 2022 / 11:44 PM IST

లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నయనతార జూన్ 9వ తేదీ వివాహబంధంతో సరికొత్త అధ్యయనాన్ని ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ ప్రేమలో ఉన్నటువంటి నయనతార ఎంతో ఘనంగా అతనిని వివాహం చేసుకున్నారు. సాధారణంగా హీరోయిన్లకు పెళ్లి జరిగితే కొందరు పూర్తిగా ఇండస్ట్రీకి దూరం కాగా కొందరు కొన్ని నిబంధనలను పెట్టుకొని సినిమాలలో నటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నయనతార సైతం సినిమా ఇండస్ట్రీకి దూరం కాకుండా తాను సినిమాల్లో నటించాలంటే కొన్ని నియమాలను పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఒక సినిమాకి సంతకం చేసే ముందు తన కండిషన్ నిర్మాతలు ఒప్పుకుంటేనే తాను అగ్రిమెంట్ పై సంతకం చేస్తారని తెలుస్తోంది.ఒకప్పుడు నయనతార ఒకప్పుడు గ్లామరస్ పాత్రలో నటించి ప్రేక్షకులను మొత్తం తనవైపు తిప్పుకుంది. ఈ మధ్యకాలంలో నయనతార పూర్తిగా గ్లామర్ పాత్రలకు దూరమవుతున్నారు.అంతేకాకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు.పూర్తిగా కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ఎక్కడా గ్లామర్ షో లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

అయితే ఇకపై ఈమె నటించే సినిమాలలో ఎలాంటి గ్లామర్ రోల్స్ లేకుండా పూర్తిగా ఇలాంటి పాత్రలను దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత తాను ఎలాంటి గ్లామర్ రొమాంటిక్ సీన్లలో నటించనని నిర్మాతలకు ఈమె కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యత కేవలం లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.పాత్రని బట్టి రొమాన్స్ లేకుండా కమర్షియల్ చిత్రాలకు ఒకే చెప్పనుందట.

అది కూడా ఇకపై ఈమె బల్క్ అమౌంట్ లో కాల్షీట్స్ ఇవ్వదట. ఇలా నయనతార సినిమాలో నటించాలంటే ఇలా కొత్త కండిషన్ లను పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఒక సినిమా పూర్తి అయిన తర్వాతనే తాను మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలా అయితేనే తన కుటుంబంతో కలిసి సమయం గడపటానికి వీలు ఉంటుందని నయనతార పలు ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus