నయనతార పెళ్ళికి రెడీ!

  • July 5, 2016 / 05:59 AM IST

ముందు శింబుతో, తర్వాత ప్రభుదేవాతో.. ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ తో సాగిస్తున్న ప్రేమాయణం ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చిన నయనతార మరోమారు వార్తల్లో వ్యక్తిగా మారింది. అయితే.. ఈసారి రీజన్ వేరు. నిన్నటివరకూ ప్రేమ వ్యవహారాలతో నెట్టుకొచ్చిన అమ్మడు ఇప్పుడు పెళ్ళికి రెడీ అయిపోయింది.

తనతో “నేను రౌడీనే” లాంటి మోడరేట్ హిట్ మూవీని తీసిన విగ్నేష్ తో గత కొంతకాలంగా చట్టాపట్టాలేసుకొని విహారయాత్రలు చేస్తున్న నయనతార త్వరలోనే ఆటగాడ్ని మనువాడనుందని సమాచారం. నిన్నమొన్నటివరకూ వీరిద్దరి వ్యవహారంపై అనుమానం ఉన్నప్పటికీ.. మొన్న జరిగిన సైమా వేడుకల్లో ముఖ్య అతిధులను కాదని, విగ్నేష్ ద్వారా అవార్డ్ ను అందుకొన్న నయనతారను చూసేసరికి అందరికీ అర్ధమైపోయింది. మరి ఈ ఇద్దరి పెళ్ళి ఎప్పుడు జరుగుతుందా? అని సినిమా అభిమానులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus