Nayanthara: నేనిలా ఉన్నా అంటే ఆయనే కారణం: నయనతార

హీరోయిన్‌ – వాళ్ల తండ్రి… ఈ సిరీస్‌లో మూడో హీరోయిన్‌ కొత్త పెళ్లి కూతురు నయనతార. ఇటీవల ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకున్న నయనతార తన తండ్రి కురియన్‌ కొడియట్టు గురించి కొన్ని విషయాలు చెప్పింది. ఫాదర్స్‌ డే సందర్భంగా నాటి విషయాలను ఓసారి రివైండ్‌ చేద్దాం. దాంతోపాటు చిన్నతనంలో నయతార అలియాస్‌ డయానా మరియమ్‌ కురియన్‌ చేసిన సరదాగా పనుల మీద కూడా ఓ లుక్కేద్దాం. చేసే పనిలో రాజీపడకపోవడం, సమయపాలనకు ప్రాధాన్యమివ్వడం, క్రమశిక్షణ ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ నాన్న కురియన్‌ కొడియట్లు నుండే వచ్చాయి అని చెప్పింది నయనతార.

కురియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారిగా విధులు నిర్వర్తించేవారు. అందుకే ఆయన క్రమశిక్షణ, సమయపాలనకు మారుపేరుగా ఉండేవారట. రోజూ పొద్దున్నే యూనిఫాంలో ఠీవిగా ఆఫీసుకు వెళ్లే ఓ పర్‌ఫెక్ట్‌ మ్యాన్‌ మా నాన్న అని గొప్పగా చెబుతుంటుంది నయనతార. అయితే కురియన్‌ గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఆయనతోనే ఎక్కువగా ఉండాలని నయనతార నిర్ణయించుకుందట. కాలాన్ని వెనక్కి తిప్పే అవకాశం వస్తే… తన తండ్రిని పూర్తి ఆరోగ్యవంతుడిలా మార్చేస్తాను అని నయనతార చెబుతోంది.

తను ఈ రోజు ఇలా ఉన్నాదంటే దానికి కారణం తండ్రే అని చెప్పిన నయ్‌… చాలామంది ఆడపిల్లల్లా మా నాన్నే నాకు హీరో అని గర్వంగా చెప్పింది. ఇటీవల దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ను వివాహం చేసుకున్న నయనతార ప్రస్తుతం అతనితో కలసి దేవాలయాలను సందర్శిస్తోంది. హనీమూన్‌ సంగతులైతే బయటకు రాలేదు. మామూలుగా అయితే హీరోయిన్లు మాల్దీవులకు ఎక్కువగా వెళ్తుంటారు. మరి నయన్‌ – విక్కీ ఏం చేస్తారో చూడాలి.

ప్రస్తుతం నయనతార చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ‘లూసిఫర్‌’ రీమేక్‌ ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో చిరంజీవికి సోదరిగా నయనతార నటిస్తోంది. బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌తో ‘జవాన్‌’ అనే సినిమా చేస్తోంది. ఈ రెండూ కాకుండా ‘కనెక్ట్‌’ అనే ఓ తమిళ సినిమా, ‘గోల్డ్‌’ అనే మరో మలయాళ సినిమాలో నటిస్తోంది నయనతార.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus