Nayanthara: పెళ్ళైన నాలుగు నెలలకే తల్లిదండ్రులు అయిన నయన్ దంపతులు..!

నయన తార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ లు ఈ ఏడాది జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఓ రిసార్ట్ లో వీరి వివాహం కొద్దిపాటి బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. వీరి పెళ్లి వేడుకకు షారుఖ్ ఖాన్, అట్లీ, రజినీ కాంత్, మణిరత్నం వంటి వారు కూడా హాజరయ్యారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.ఇదిలా ఉండగా… నయన్ – విఘ్నేష్ ల జంట పెళ్ళైన 4 నెలలకే తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశారు.

అవును నయన్ – విఘ్నేష్ లు తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయాన్ని విఘ్నేష్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. వీరు కవలలకు జన్మనిచ్చారు.ఇద్దరూ మగ పిల్లలే .! ‘ మీ ప్రార్థనలు, పెద్దల ఆశీర్వాదాలు ఫలించాయి అంటూ విఘ్నేష్ పేర్కొన్నాడు. అంతేకాకుండా వీరి పిల్లల మొహాలు కనబడకుండా తీసిన ఫొటోలను కూడా షేర్ చేశాడు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది కూడా అని చెప్పొచ్చు.

4 నెలల క్రితమే పెళ్ళయితే అప్పుడే పిల్లలు ఎలా పుట్టేశారు అంటూ కొందరు, అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ నయన్ కు కవల పిల్లలు పుడతారు మచ్చ శాస్త్రాన్ని బట్టి అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం సరోగసి పద్దతిలో పిల్లల్ని కని ఉంటారు ఈ దంపతులు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక నయన తార ఇటీవల గాడ్ ఫాదర్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.

1

2

3

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus