తనకి కాబోయే భర్త పేరు చెప్పిన నయనతార!

గాసిప్ లు, విజయాలు ఏదైతే కానీ కేరళ బ్యూటీ నయనతార నిత్యం వార్తల్లోనే ఉంటోంది. తాజాగా మరోసారి బ్రేకింగ్ న్యూస్ గా మారింది. గతంలో నయనతార శింబు, ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపింది. పెళ్లి దాకా వెళ్లి విఫలం అయింది. రీసెంట్ యంగ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు తమిళ పత్రికలూ కథనాలను ప్రచురిస్తున్నాయి. దీనిపై ఈ ప్రేమ జంట ఇంతవరకు నోరు మెదపలేదు. తొలిసారి నయన తార బయటికి చెప్పింది. ‘ది హిందూ’ ఆంగ్ల దినపత్రిక  చెన్నైలో నిర్వహించిన ‘వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018’ అవార్డుల ప్రదానోత్సవం ఇందుకు వేదికైంది.

ఈ కార్యక్రమంలో నటనా రంగంలో ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్న నయనతార  తన తల్లిదండ్రులకు, సోదరుడికి కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాక తనకు కాబోయే భర్త (విఘ్నేశ్‌ )కి కూడా  థాంక్స్ చెప్పింది. దీంతో ఇంతకాలంగా నయనతార పెళ్లి చేసుకోబోయేది విఘ్నేశ్‌నా? కాదా? అన్న అనుమానాలకు తెరపడింది. రహస్యంగా పెళ్లి చేసుకుందనే రూమర్లకు కూడా ఫుల్ స్టాప్ పడింది.  “నానుమ్ రౌడీ ధాన్ (నేనూ రౌడీనే)’ చిత్రం షూటింగ్ సమయంలో విఘ్నేశ్, నయన్ మధ్య  ప్రేమ చిగురించింది. అవకాశాలు వస్తున్న సమయంలో పెళ్లి చేసుకుంటే.. అవి దూరమవుతాని భావించి ఈ జంట పెళ్లిని వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమాలో నటిస్తున్న నయన పెళ్లి డేట్ ని ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus