Nayanthara, Vignesh : భర్త విగ్నేష్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నయనతార..!

స్టార్ హీరోయిన్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్‌.. చెన్నైలోని మహాబలిపురంలో జూన్‌ 9న ఓ రిసార్ట్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి అతి తక్కువ మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. నయనతార పెళ్లి అంటే చాలా గ్రాండ్ గా జరుగుతుంది అని అంతా అనుకున్నారు. కానీ వీళ్ళు సింపుల్ గానే చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిరోజున.. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు, వృద్ధులకు, అనాథలకు, చిన్నారులకు అన్నదానం చేశారు.

సుమారు లక్ష మందికి నయన్ విగ్నేష్ లు అన్నదానం చేసినట్లు తెలుస్తుంది. ఆ వంటలు కూడా సాధారణంగా లేవట. విందు భోజనం చాలా వెరైటీలతో కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని దానాల్లో కన్నా గొప్ప దానం అన్నదానం కాబట్టి.. వీళ్ళు చాలా గొప్ప పని చేశారు అని చెప్పాలి. మరోపక్క ఈ దంపతులు ఒకరికి ఒకరు ఖరీదైన గిఫ్ట్‌ లు ఇచ్చుకున్నారు. నయనతార.. ఓ కొత్త బంగ్లాను విఘ్నేశ్‌ పేరు పై రాసేసింది. దీని విలువ భారీగా రూ.20 కోట్లు ఉంటుందని తెలుస్తుంది.

ఇది మామూలు విషయం కాదు.మరోపక్క విగ్నేష్ కూడా నయన్‌ కు పెళ్లి కోసం రూ.3 కోట్ల విలువైన జ్యుయలరీ ని తన తల్లిదండ్రుల చేతుల మీదుగా ఇప్పించాడట. అంతేకాకుండా రూ.5 కోట్లు విలువ గల డైమండ్‌ రింగ్‌ ను కూడా బహుకరించినట్టు తెలుస్తుంది. 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. విగ్నేష్ నయన్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే ఈమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. విగ్నేష్ అక్కడ టాప్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు అంటే అందులో నయన్ హస్తం కూడా ఉంది.

1

2

3

4

5

6

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus