టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన బన్నీ...మెగా స్టార్ చిరు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తరువాత మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్టూ దూసుకుపోతున్నాడు. అయితే అదే క్రమంలో మెగా ఫ్యాన్స్ బలంతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బన్నీ...ప్రత్యేక అభిమాన గళాన్ని ఏర్పరుచుకుని తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ లో మన బన్నీకి ఘోర అవమానం జరిగింది. దానికి కారణం నయనతార. విషయంలోకి వెళితే....నయన తారకు తమిళంలో బెస్ట్ హీరొయిన్ గా నయనతార 'నానుమ్ రౌడీ' అనే చిత్రానికి అవార్డు వచ్చింది. ఇక అవార్డు ఇచ్చేందుకు అల్లు అర్జున్ ని స్టేజ్ పైకి పిలిచారు. అక్కడే ఆమె చేసిన పని బన్నీని చిన్నబుచ్చినట్లు అయ్యింది...ఇంతకీ నయన చేసిన తప్పు ఏంటి అంటే...తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో పేరు తెచ్చున్న అల్లు అర్జున్ ని స్టేజ్ పైకి పిలిచిన తర్వాత అతన్ని కాదని నయన తార ఈ మూవీ డైరెక్టర్ విగేష్ శివన్ నన్ను ఈ చిత్రంలో నీకంటే కూడా ఎవ్వరు బాగా చేయలేరు అని ప్రోత్సహించి నాతో ఈ సినిమాలో నటించేలా చేసిన విగేష్ శివన్ చేతుల మీదగా తీసుకుందాం అని అనుకుంటున్నాను అని స్టేజి మీద అవార్డు ఇవ్వడానికి రెడీగా ఉన్న అల్లు అర్జున్ పరువు తీసేసింది. అయితే ఇక్కడ మరో విచిత్రం ఏంటి అంటే...గత కొంత కాలంగా విగేష్ శివన్, నయన తార ఇద్దరూ పీకల్లోతుల్లో ప్రేమలో ఉన్నారు... ఏది ఏమైనా...నయన్ చేసిన పనికి బన్నీ ఫ్యాన్స్ విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.