సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార ఇటీవల నటించిన ‘ఐరా’, ‘మిస్టర్ లోకల్’ వంటి చిత్రాలు ఫ్లాపయ్యాయి. ఇక ఈమె నటించిన తాజా చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘కొలైయుదీర్ కాలం’ చిత్రం విడుదలకు అనేక అడ్డంకులు వస్తున్నాయి. ఈ చిత్రం ప్రారంభం నుండీ ఈ చిత్రానికి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గానూ.. నిర్మాణ భాగస్వామిగా ఉండేవాడు. ఆ తరువాత ఈ చిత్రం నుండీ ఆయన తప్పుకున్నాడు.
ఇక ఇటీవల జరిగిన.. ఆడియో ఆవిష్కరణ వేడుకలో కూడా సీనియర్ నటుడు రాధారవి.. నయనతార పై వివాదాస్పద కామెంట్లు చేసిన సంగతి కూడా తెలిసిందే.
ఇక అయిందేదో అయ్యింది… అనుకుని జూన్ 14న సినిమా విడుదల అనుకుంటే.. మద్రాస్ హైకోర్టు మరో షాకిచ్చింది. విషయం ఏంటంటే.. బాలాజీ మోహన్ అనే వ్యక్తి ‘కొలైయుదీర్ కాలం’ చిత్రం టైటిల్ ను తాను రూ.10 లక్షలు చెల్లించి పొందానని, ఆ టైటిల్ హక్కులు తనకు చెందుతాయని.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన టైటిల్ ను వాడుకున్నందుకు నయనతార చిత్ర విడుదలను నిలిపివేయాలని అందులో పేర్కొన్నాడు. ఇక ఈ విషయం పై విచారించిన హైకోర్టు మంగళవారం నయనతార నటించిన ఈ సినిమా విడుదల పై స్టే విదిస్తూ ఉతర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారం పై ఈ జూన్ 21లోపు వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంటే చిత్రం విడుదల ఆగిపోయినట్టే..! ఏదేమైనా నయన్ కు మరో షాక్ తగిలింది.