Nayanthara: ఆ ఒక్క కారణం వల్లే నయన్ తల్లి పెళ్లికి రాలేదట..కానీ!

సౌత్ ఇండియాలో లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన హీరోయిన్లలో నయనతార ఒకరు. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా కూడా నయన్ రికార్డు సృష్టించారు. ఈమె ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు నుండి రూ.7 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ వస్తుంది. విమెన్ సెంట్రిల్ చిత్రాలకి కెరాఫ్‌ అడ్రెస్‌గా మారిపోయింది నయనతార. ఇదిలా ఉండగా… నయన్ కు ఇంత పెద్ద స్టార్ ఇమేజ్ వెనుక విఘ్నేష్‌ శివన్‌ హస్తం ఉందన్న సంగతి తెలిసిందే.

2015 నుంచి ఈ జంట ప్రేమించుకుంటున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ జంట వివాహం చేసుకుని భార్యాభర్తలుగా మారారు. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరుకాగా.. సినీ పరిశ్రమ నుండీ రజనీకాంత్‌, షారుక్‌ఖాన్‌ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు.మరోపక్క తమ పెళ్లి సందర్భంగా నయన్‌ దంపతులు తమిళనాడులో మొత్తంగా లక్ష మంది అనాథలు, వృద్ధులకు వివాహ భోజనం పెట్టారు. అంతా బాగానే ఉంది కానీ..

నయన్‌ వివాహానికి ఆమె కన్న తల్లి హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. కన్న కూతురి పెళ్ళికి ఆ తల్లి ఎందుకు హాజరు కాలేదు అనే చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్లే నయన్ తల్లి ఆమె పెళ్ళికి రాలేకపోయిందట. పెళ్ళైన వెంటనే నయన్ భర్తతో కలిసి తల్లిని కలిసేందుకు కేరళ కి వెళ్లడం జరిగింది.

అక్కడే ఈ జంట కొద్ది రోజులు గడపడానికి కూడా డిసైడ్ అయ్యారు. ఇంకో రెండు వారాల పాటు ఈ జంట అక్కడ ఉంటుందని తెలుస్తుంది. నయన్ తల్లి కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్లు వినికిడి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus