నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని కలయికలో ఓ భారీ బడ్జెట్ మాస్ సినిమా రూపొందనుంది.’ఎన్.బి.కె 111′(NBK 111) అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో బాలయ్యని గోపీచంద్ మలినేని ప్రెజెంట్ చేసిన తీరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. అందుకే వీరి కాంబోలో రూపొందనున్న నెక్స్ట్ సినిమాపై అంచనాలు పెరిగాయి.
బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. కాకపోతే.. గోపీచంద్ మలినేనితో ఉన్న సమస్య ఏంటంటే.. బడ్జెట్ భారీగా పెట్టించేస్తాడు. అనవసరమైన సన్నివేశాలు అన్నీ తీసేసి..నిర్మాతలపై భారం పెట్టడం అతనికి అలవాటు. ‘జాట్’ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడానికి కారణం అదే అని అంటుంటారు. చిన్న చిన్న సన్నివేశాలకు కూడా ఔట్ డోర్ షూటింగ్ షెడ్యూల్స్ పెట్టేసి.. ఆ సినిమాకి బడ్జెట్ బాగా పెంచేశాడనే టాక్ ఉంది.
ఇలాంటి పరిస్థితులు వస్తాయనే కావచ్చు.. రవితేజతో గోపీచంద్ చేయాల్సిన సినిమాని కూడా ఆపేశారు నిర్మాతలు.ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు బాలయ్యతో గోపీచంద్ మలినేని చేయబోయే సినిమాకి స్క్రిప్ట్ దశలోనే భారీ బడ్జెట్ అవుతుందట. దీంతో నిర్మాతలు ముందుగానే జాగ్రత్త పడాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా.. మలినేని మళ్ళీ తన టీంతో కలిసి స్క్రిప్ట్ పై వర్క్ చేశాడు.
మరోవైపు నిర్మాతలు కాస్ట్ కటింగ్ పనులు కూడా పెట్టారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ నయనతారని ఈ ప్రాజెక్టు నుండి తప్పించే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే.. ఈ సినిమా కోసం నయన్ రూ.8 కోట్లు పారితోషికం డిమాండ్ చేసింది. ఆమె ప్లేస్ లో వేరే హీరోయిన్ ను తీసుకుంటే.. బడ్జెట్ రూ.6 కోట్ల వరకు సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.