Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

శివాజీ, అనసూయ..ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అందుకు అతను క్షమాపణ చెప్పాడు. మహిళా కమిషన్ ఆఫీసుల చుట్టూ కూడా తిరిగాడు. తన బాధలు ఏవో తాను పడుతున్నాడు. కానీ యాంకర్ అనసూయ మాత్రం ఛాన్స్ దొరికిన ప్రతిసారి శివాజీని కెలుకుతుంది. దీంతో సోషల్ మీడియాలో కూడా ఆమె పట్ల వ్యతిరేకత నెలకొంది.

Raasi

ఈ క్రమంలో అనసూయ గతంలో చేసిన స్కిట్లో ‘రాశి గారి ఫలాలు’ అంటూ పలికిన డైలాగ్ ను నెటిజెన్లు షేర్ చేస్తూ వల్గర్ కామెంట్స్ అంటూ అనసూయని తిట్టిపోస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రాశిని(Raasi) అవమానించావు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో హీరోయిన్ రాశి దృష్టికి వెళ్ళింది. తాజాగా ఆమె ఆ వీడియోపై స్పందించి అనసూయపై పరోక్షంగా ఫైర్ అయ్యింది.


రాశీ మాట్లాడుతూ.. “శివాజీ నాకు బాగా తెలుసు.ఆయన హీరోయిన్స్ డ్రెస్సింగ్ గురించి చేసిన కామెంట్స్ తప్పు అని నేను అనుకోను. కొన్ని పదాలు తప్పుగా వెళ్లాయి. కాదనడానికి లేదు. ఆ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకున్నారు. క్షమాపణలు చెప్పారు.మైక్ దొరికింది కదా ఏదోకటి మాట్లాడొచ్చని నేను ఇలా మాట్లాడటం లేదు. శివాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. అందులో అనుకోకుండా 2,3 పదాలు తప్పుగా వచ్చాయి.

అయితే నా ప్రమేయం లేకుండా కొంతమంది నా ప్రస్తావన తీసుకొచ్చారు. 3,4 ఏళ్ళ క్రితం నా భర్త నాకు ఒక వీడియోని చూపించారు. ఆ షో జడ్జ్..లు నాకు తెలుసు, అలాగే యాజమాన్యం కూడా అప్పట్లో నాకు ఫోన్ చేసి ‘మీరు ‘ప్రేయసి రావే’ సినిమా స్కిట్ చేయండి’ అని నన్ను అడిగారు. కానీ ‘కొన్ని ఎపిక్స్ మనం టచ్ చేయకూడదు. దానికి కామెడీ స్కిట్ చేయడం కరెక్ట్ కాదు. కావాలంటే జడ్జిగా వస్తాను’ అని చెప్పాను. అయినా సరే దానికి స్కిట్ చేశారు.

ఒక సందర్భంలో ‘రాశి ఫలాలు’ అనే పదం వాడారు. ‘రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా?’ అంటూ ఆ లేడీ యాంకర్ పలికింది. ఆమె అలా ఎలా కామెంట్ చేస్తుంది.? మొదట నేను గమనించలేదు.. మైండ్ కి కూడా తీసుకోలేదు. ‘రాశి ఫలాలు’ అనే పదం కామన్. అందులో నేను లేను. కానీ ‘రాశి గారి ఫలాలు’ అంటే అందులో నేను ఉన్నాను కదా. ఆ లేడీ యాంకర్ నా గురించే మాట్లాడింది. అక్కడ జడ్జ్..లలో ఒక లేడీ ఉంది. ఆమె కూడా హాహాహా అని నవ్వింది.

నేను ఆ ప్లేస్ లో ఉండుంటే, షో ఆపేసి ‘రాశి గారి ఫలాలు’ అని ఎందుకు అంటున్నారు? అంటూ నిలదీసేదాన్ని. కామెడీ చెయ్యొచ్చు, కానీ బాడీ షేమింగ్ చేయడానికి ఆమె ఎవరు? కన్న తల్లిదండ్రులకు కూడా బాడీ షేమింగ్ చేసే రైట్ లేదు. దీనిని లీగల్ ఇష్యూ చేద్దాం అని అనుకున్నాను. కానీ మా అమ్మ అలాంటివి వద్దు అని చెప్పడంతో.. లైట్ తీసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus