Nayanthara: ఇంకా నుండి అలాంటి పాత్రలు మాత్రమే చేస్తా: నయనతార

  • September 25, 2023 / 12:47 PM IST

తెలుగు , తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి, ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని పాత్రలను పోషించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార, రీసెంట్ గానే షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో హీరోయిన్ గా నటించి, బాలీవుడ్ లో తొలిసినిమా తోనే సూపర్ హిట్ ని అందుకున్న హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోయింది. ఈ చిత్రం అతి త్వరలోనే బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టబోతుంది.

అంత పెద్ద సినిమాలో హీరోయిన్ గా నటించడం నయనతార అదృష్టం. కానీ ఆమె మాత్రం ఆ చిత్ర దర్శకుడు అట్లీ మీద పీకలదాకా కోపంతో ఉన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ మొత్తం ఇదే చర్చ హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంది. అంత పెద్ద హిట్ ఇచ్చిన అట్లీ మీద నయనతార అంత కోపంగా ఉండడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.

నయనతార ఈమధ్య కాలం లో నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎక్కువగా పోషిస్తూ వస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ ఆమె పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉండే విధంగా చూసుకుంటూ వచ్చింది, ఇది మనం గమనించొచ్చు. కానీ ‘జవాన్’ చిత్రం లో అదే మిస్ అయ్యింది. ఈమె పాత్ర కంటే , కేవలం పది నిమిషాల నిడివి ఉన్న క్యారక్టర్ చేసిన దీపికా పదుకొనే క్యారక్టర్ సినిమాకి పెద్ద హైలైట్ అయ్యింది. దీనిపై నయనతార అసంతృప్తి తో ఉందట.

ఇక మీదట బాలీవుడ్ లో ఎంత మంచి ఆఫర్ వచ్చినా నటించకూడదని ఈ సినిమాతో నిర్ణయం తీసుకుందట. ఇదే కనుక నిజమైతే నయనతార కమిట్మెంట్ కి సెల్యూట్ చెయ్యొచ్చు. ఎలాంటి ఆఫర్ వచ్చినా టెంప్ట్ అవ్వకుండా కేవలం తన పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే నటిస్తాను అనే మాటకి కట్టుబడి ఉండడం నయనతార నిబద్దత కి నిదర్శనం అని నెటిజెన్స్ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus