Nayanthara, Vignesh: భర్తతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్న నయనతార!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నయనతార గత దశాబ్ద కాలం ఇండస్ట్రీలో అగ్రనటిగా కొనసాగుతూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడు సంవత్సరాల నుంచి నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట జూన్ 9వ తేదీ ఎంతో అంగరంగ వైభవం వీరి వివాహాన్ని జరుపుకున్నారు. ఇకపోతే వీరి వివాహానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు కోలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే పెళ్ళికి ముందు ఈ జంట పలు దైవ దర్శనాలకు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే పెళ్లయిన వెంటనే కొత్త జంట మరోసారి దైవదర్శనానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భార్యాభర్తలుగా నయనతార విగ్నేష్ శివన్ మొట్టమొదటిసారిగా తిరుమల శ్రీవారి ఆలయం సందర్శించినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం తిరుమలకు చేరకున్న నయన్, విఘ్నేష్‌ శ్రీవారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఆలయ అర్చకులు ఈ నూతన జంటకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలతో ఈ జంటను ఆశీర్వదించారు. ఇకపోతే నయనతార విగ్నేష్ పెళ్లి వేడుకల కోసం కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.ఇక 11వ తేదీన చెన్నైలో ఎంతో ఘనంగా జరుగుతున్న రిసెప్షన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బంధుమిత్రులు సినీ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

ఇక వీరి వివాహం జరిగిన తర్వాత నయనతార విగ్నేష్ దంపతులు కొన్ని ఆలయాలలో అన్నదానం చేయడమే కాకుండా ఎన్నో అనాధ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలలో కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus