Nayanthara: తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరిగిన నయన్- విగ్నేష్ దంపతులు..!

‘తిరుమల శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగింది.. ఆలయం ముందు చెప్పులు వేసుకుని తిరిగారు నూతన దంపతులు నయనతార- విగ్నేష్’.. అంటూ ఇప్పుడు ఎక్కువగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటిని బట్టి విషయం ఏంటి అన్నది ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. వివాహం అనంతరం శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు నయనతార దంపతులు. అయితే వీళ్ళు చెప్పులు వేసుకుని మాడవీధుల్లో తిరగడం పై భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఫోటోలు కూడా దిగారు ఈ నూతన దంపతులు.

అయితే చెప్పులు, బూట్లు వేసుకోవడం..అక్కడ కెమెరామెన్లు ఉండడంతో తమ కెమెరాల్లో వారు చేసిన పొరపాటును బంధించారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కూడా దీన్ని పట్టించుకోలేదు. సెలబ్రిటీల విషయంలో రూల్స్ బ్రేక్ చేయొచ్చు అని మరోసారి వారు నిరూపించారు. ఇక నయన్- విగ్నేష్ లను చూడటం కోసం అక్కడి జనం ఎగబడ్డారు. ఇక నిన్ననే అంటే జూన్ 9న తమిళ నాడులోని మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు విగ్నేష్ – నయన్.

వీరి పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా వచ్చి ఈ దంపతులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పెళ్లికి ముందు కూడా విగ్నేష్ నయన్ లు తిరుమల వెళ్లి తమ పెళ్ళికి సంబంధించిన లగ్న పత్రికను శ్రీవారి పాదాల దగ్గర పెట్టారు. నిజానికి వీరి పెళ్లి మొదట ఇక్కడే జరుగుతుంది అని అంతా అనుకున్నారు. తర్వాత మహాబలిపురానికి మార్చారు. విగ్నేష్ కు మరియు అతని కుటుంబ సభ్యులకి వెంకటేశ్వర స్వామి ఇష్టమైన దైవం. అందుకే తిరుమల కి అతను ఎక్కువగా వస్తూ ఉంటాడు.

1

2

3

4

5

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus