ఏకంగా బాలయ్యకే ఎసరు పెట్టేసింది..!

సౌత్ లో నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ తో పాటూ తెలుగులో కూడా ఆమె చిత్రాలు మంచి విజయాన్ని నమోదుచేస్తాయి. నయన స్టార్ హీరోతో నటించినా.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసినా.. ప్రేక్షకులు నయన్ చిత్రాలకి బ్రహ్మ రథం పాడుతారు అనడంలో సందేహం లేదు. గతంలో వచ్చిన ‘కర్తవ్యం’ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే గతేడాది తమిళ్ లో విడుదలైన నాయన తార చిత్రం ‘ఇమైక్కా నోడిగళ్’ ను తెలుగులో ‘అంజలి సీబీఐ’ పేరుతో ఫిబ్రవరి 22 న విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాంబాబు .. ఆచంట గోపీనాథ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అయితే నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం రోజునే ఈ చిత్రం కూడా విడుదలయ్యింది. బాలయ్య సినిమా ఉండగా నయన తార చిత్రం… అందులోనూ.. తమిళ్ లో ఎప్పుడో వచ్చిన ఓ డబ్బింగ్ చిత్రం ఏం నిలబడుతుందిలే అనుకున్నారు అంతా..! అందులోనూ ఈ మధ్య విడుదలైన తమిళ్ డబ్బింగ్ చిత్రాలు ఏవి ఆకట్టు కోలేదు. అయితే అనూహ్యంగా నయనతార ‘అంజలి సీబీఐ’ చిత్రం తెలుగులో మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఏకంగా బాలయ్య చిత్రాన్నే మించి ఈ చిత్రానికి కలెక్షన్లు వస్తున్నాయి. తొలి రోజున అంతంత మాత్రమే వసూళ్ళు వచ్చినా… తరువాత ఈ చిత్రం జోరందుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి లాభాలు కూడా వచ్చేశాయట. దీంతో గత సంవత్సరం హిట్టయిన బాలయ్య చిత్రం ‘జై సింహా’ కి కూడా నయనతార వలనే హిట్టయింది అనే కామెంట్స్ మొదలయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus