‘లేడీ టైగర్’గా లేడీ సూపర్ స్టార్!!

  • April 25, 2018 / 09:52 AM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా మలయాళంలో మంచి విజయం సాధించిన “ఎలెక్ట్ర” చిత్రం తెలుగులో “లేడీ టైగర్” పేరుతో విడుదల కానుంది. సురేష్ సినిమా పతాకంపై.. సి.ఆర్.రాజన్ సమర్పణలో.. సురేష్ దూడల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీమతి సరోజ సురేష్ సహ నిర్మాత. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ మనీషా కొయిరాలా ముఖ్య పాత్ర పోషించగా.. ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. బిజూ మీనన్ మరో ముఖ్య పాత్రధారి. రాజశేఖర్ రెడ్డి మాటలు, వెనిజండ్ల శ్రీరామ్మూర్తి పాటలు అందించిన ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus