నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాలకృష్ణ వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా NBK107 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ మొదటి సారిగా నటిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటూ ఉండగా బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన బాలీవుడ్ హీరోయిన్ నటించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన ఓ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇంకా షూటింగ్ పనులు మొదలు పెట్టకుండానే అప్పుడే విడుదల తేదీని ఫిక్స్ చేసినట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకొనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడవ తేదీ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట.
ఇలా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడవ తేది విడుదల కాబోతుందని తెలియడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ స్థాయిలో నిర్మించగా ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు.