బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను ఇప్పటికే రెండు సార్లు విచారించారు ఎన్సీబీ అధికారులు. ఇప్పుడు ఆమెకి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆమె ఈ వారంలోనే మరోసారి విచారణ కోసం ఎన్సీబీ ఆఫీస్ కు రాబోతుంది. నిజానికి నిన్ననే ఆమె ఎన్సీబీ విచారణకు రావాలి. కానీ తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు అనన్య పాండే, ఎన్సీబీకి సందేశం అందించింది. దీన్ని అంగీకరించిన అధికారులు.. ఆమెకు ఫ్రెష్ గా మరోసారి నోటీసులు జారీ చేశారు.
ముంబై క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్యన్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అందులో అనన్య పాండేతో అతడు జరిపిన వాట్సాప్ చాట్స్ గుర్తించారు. ఆ చాటింగ్ లో డ్రగ్స్ ప్రస్తావన ఉండడంతో అనన్య పాండే ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పాటు ఆమెని ఇలా దశలవారీగా విచారిస్తున్నారు. అయితే అనన్య పాండే మాత్రం తనకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధంలేదని అధికారులకు వెల్లడించింది.
తను కేవలం ఆర్యన్ తో డ్రగ్స్ గురించి జోక్ మాత్రమే చేశానని చెప్పింది. ఎన్సీబీ అధికారులకు మాత్రం ఆర్యన్ కు డ్రగ్స్ సప్లై చేసేవారి గురించి అనన్యకు తెలిసే ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే ఆమెని మరోసారి విచారించడానికి రెడీ అవుతున్నారు.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?