ఉదయ్ కిరణ్ కెరీర్ లోని హిట్ సినిమాలలో నీ స్నేహం మూవీ కూడా ఒకటి. పరుచూరి మురళి డైరెక్షన్ లో ఎం.ఎస్. రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. 2002 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఉదయ్ కిరణ్ కు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ మాధవ్ రోల్ లో నటించగా జతిన్ గ్రేవాల్ శీను రోల్ లో నటించడం జరిగింది.
ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి. ఈ సినిమాలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా కళాతపస్వి కె.విశ్వనాథ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ రోల్ లో జతిన్ అద్భుతంగా నటించి మెప్పించారు. అయితే ప్రస్తుతం జతిన్ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అనే ప్రశ్నలకు జవాబు చాలామంది అభిమానులకు తెలియదు.
నీ స్నేహం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా జతిన్ కెరీర్ మొదలైంది. తెలుగు సినిమాలతో పాటు హిందీ, పంజాబీ సినిమాలలో నటించి జతిన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం జతిన్ అమెరికాలోని కాలిఫోర్నియాలో జీవనం సాగిస్తున్నారు. సినిమా ఆఫర్లు వస్తున్నా వాటికి జతిన్ నో చెబుతున్నారని సమాచారం అందుతోంది. 2010 సంవత్సరంలో కరోలినా గ్రేవాల్ అనే అమ్మాయితో జతిన్ వివాహం జరిగింది.
జతిన్ కరోలినా గ్రేవాల్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జతిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకిన రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాల విషయంలో జతిన్ ప్లానింగ్ ఏ విధంగా ఉందో క్లారిటీ రావాల్సి ఉంది. జతిన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ జతిన్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నారు.