Neha Chowdary: బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన నేహా చౌదరి!

  • September 29, 2022 / 11:39 PM IST

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో కొంతమందికి ప్లస్ అయితే చాలామందికి మైనస్ అవుతోంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో చాలామంది కంటెస్టెంట్లు ఈ షో తమకు మైనస్ అయిందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. బిగ్ బాస్ హౌస్ నుంచి మూడో వారం ఎలిమినేట్ అయిన నేహా చౌదరి ఈ షో గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేను బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యానంటే చాలామంది నమ్మడం లేదని ఆమె కామెంట్లు చేశారు. నా ఎలిమినేషన్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని అంటున్నారని నేహా చౌదరి కామెంట్లు చేశారు. కంటెంట్ ఇవ్వని వాళ్లు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారని అయితే ఆ కంటెస్టెంట్ల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదని నేహా చౌదరి కామెంట్లు చేశారు. వాసంతి గ్లామర్ డాల్ గానే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నానని నేహా చౌదరి అన్నారు.

నేను నిజంగా తప్పు చేసి ఉంటే ఎపిసోడ్ లో ఎందుకు హైలెట్ చేయలేదని నేహా చౌదరి కామెంట్లు చేశారు. ఇనయా గురించి బిగ్ బాస్ హౌస్ లో చాలామంది రాంగ్ గా మాట్లాడారని వీకెండ్ లో నాగార్జున వచ్చి నా వెర్షన్ ను రివర్స్ చేశారని నేహా చౌదరి చెప్పుకొచ్చారు. నాగార్జున గారు ఫెయిర్ గా ఉండటం లేదని టాక్ నడుస్తోందని దీనిపై నేను కామెంట్ చేయనని నేహా చౌదరి వెల్లడించడం గమనార్హం.

నాగార్జున గారు ఒకరిద్దరు కంటెస్టెంట్లను కావాలనే హైలెట్ చేస్తున్నారని అనిపిస్తోందని నేహా చౌదరి చెప్పుకొచ్చారు. నాగార్జునకు ఆర్జీవీతో స్నేహం ఉందని ఆ స్నేహం వల్లే ఇనయా హౌస్ లో కొనసాగుతోందని నేహా చౌదరి చెప్పుకొచ్చారు. ఆర్జీవీ ఇనయాకు అనుకూలంగా పోస్ట్ పెట్టాడంతో ఆమె సేవ్ అయ్యారని నేహా చౌదరి కామెంట్లు చేశారు. నేహా చౌదరి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus