హ్యాపీ ఫాదర్స్ డే అమ్మా.. ప్రముఖ నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఈ నెల 16వ తేదీన ఫాదర్స్ డే కావడంతో చాలామంది సెలబ్రిటీలు తమ తండ్రిని తలచుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టడం జరిగింది. అయితే ప్రముఖ నటి నేహా సక్సేనా మాత్రం అమ్మైనా నాన్నైనా ఫ్రెండ్ అయినా అన్నీ నువ్వే అమ్మా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నేహా సక్సేనా తన పోస్ట్ లో “హ్యాపీ ఫాదర్స్ డే అమ్మా! నాన్న లేడన్న లోటు నాకు తెలియకుండా పెంచావు..

పుట్టినప్పటి నుంచి నువ్వే నా ప్రపంచం.. అమ్మ నాన్న ఫ్రెండ్ అన్నీ నువ్వే అయ్యావు.. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు థాంక్యూ అమ్మా.. నా చివరి శ్వాస వరకు నువ్వు గర్వపడేలా కృషి చేస్తాను.. ఆ దేవుడు నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.. ఈ ప్రపంచంలో అందరి కంటే నువ్వే ఇష్టం.. లవ్ యూ మా” అని పోస్ట్ లో పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా సుపరిచితం కాకపోయినా ఇతర భాషల్లో ఈ నటికి మంచి పేరు ఉంది.

రిక్షా డ్రైవర్ అనే తుళు మూవీతో నేహా సక్సేనా కెరీర్ మొదలైంది. నేహా సక్సేనా ఒక తెలుగు సినిమాలో సైతం నటించారు. ప్రేమకు చావుకు అనే తెలుగు మూవీ ఆమె నటించి మెప్పించారు. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ నటి బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ నటి వృషభ అనే సినిమాలో నటిస్తున్నారు.

నేహా సక్సేనా తల్లితో వేర్వేరు సందర్భాల్లో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నేహా సక్సేనా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆమెకు ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. నేహా సక్సేనా రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus