Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » థియేటర్లలో ఫ్లాప్‌ మరి ఓటీటీల్లో ఏం చేస్తాడో?

థియేటర్లలో ఫ్లాప్‌ మరి ఓటీటీల్లో ఏం చేస్తాడో?

  • October 11, 2022 / 04:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

థియేటర్లలో ఫ్లాప్‌ మరి ఓటీటీల్లో ఏం చేస్తాడో?

ఒకేసారి రెండు ఓటీటీల్లో సినిమాలు రిలీజ్‌ చేయడం, ఒక ఓటీటీలో వచ్చిన సినిమా కొద్ది రోజుల తర్వాత మరో ఓటీటీలో రావడం లాంటివి మనం ఇప్పటికే కొన్ని సినిమాల విషయంలో చూశాం. అయితే అవన్నీ పెద్ద హీరోల సినిమాలు. భారీ హిట్‌ కొట్టిన సినిమాలు. అయితే బాక్సాఫీసు దగ్గర ఇబ్బందికర ఫలితాన్ని అందుకున్న చిన్న హీరో సినిమా రెండు ఓటీటీల్లో విడుదల అవుతోంది అంటే ఆసక్తికర విషయమే కదా. ఆ హీరోనే కిరణ్‌ అబ్బవరం. ఆ సినిమానే ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’.

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘ఆహా’, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ నెల 14 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని చిత్రబృందం ప్రకటించింది. దర్శకుడు శ్రీధర్‌ గాదె తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబరు 16న థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో సంజనా ఆనంద్‌, సోనూ ఠాకూర్‌ కథానాయికలు. అయితే ఆశించిన మేర సినిమా విజయం అందుకోలేదు.

సినిమా కథ సంగతి చూస్తే.. తేజు (సంజ‌నా ఆనంద్‌) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓ కుర్రాడిని ప్రేమించి.. అతడి చేతిలో మోస‌పోతుంది. దీంతో ఇంట్లో వాళ్ల‌కు ముఖం చూపించుకోలేక జీవితాన్ని భారంగా గ‌డిపేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే తాగుడుకి బానిస‌ అవుతుంది. ఆ సమయంలో ఆమె జీవితంలోకి క్యాబ్ డ్రైవ‌ర్‌ వివేక్ (కిర‌ణ్ అబ్బ‌వ‌రం) వస్తాడు. తేజు తాగి ప‌డిపోయిన ప్ర‌తిసారీ ఆమెను రూంలో డ్రాప్ చేస్తాడు. అలా ఓసారి ఆమెను ఓ గ్యాంగ్‌ కిడ్నాప్ చేయ‌బోతే కాపాడ‌తాడు.

దీంతో వివేక్‌పై ఆమె మంచి అభిప్రాయం ఏర్ప‌డుతుంది. దీంతో త‌న విషాద గాథ‌ను వివేక్‌కి చెబుతుంది. అదే స‌మ‌యంలో వివేక్ కూడా త‌న ఫెయిల్యూర్‌ లవ్‌స్టోరీని తేజుకి చెబుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? ఇద్ద‌రి ప్రేమ‌ క‌థ‌ల‌కు ఉన్న లింకేంటి? ఒక‌రి క‌థ మ‌రొక‌రు తెలుసుకున్నాక ఏం చేశారు అనేది సినిమా మిగతా కథ. ఆసక్తిగా అనిపిస్తే 14 వరకు వెయిట్‌ చేసి ఓటీటీల్లో చూసేయండి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Nenu Meeku Baaga Kavalsinavaadini
  • #Sanjana Anand
  • #Sridhar Gade

Also Read

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

1 hour ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

6 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

9 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

9 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

9 hours ago

latest news

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

53 mins ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

2 hours ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

3 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version