Nayanthara, Vignesh: నయన్‌ – విఘ్నేష్‌ పెళ్లికి రూపాయి కూడా ఖర్చవ్వలేదా?

  • June 14, 2022 / 10:31 PM IST

నయనతార – విఘ్నేశ్‌ శివన్‌ల వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం ఈ జంట ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని సమాచారం. అంత ఘనంగా జరిగిన పెళ్లికి రూపాయి కూడా ఖర్చవ్వలేదా? అనే అనుమానం మీకు వచ్చి ఉంటుంది. పెళ్లి డబ్బులు ఖర్చయ్యాయి. కానీ ఆ డబ్బులు పెట్టుకుంది నయన్‌ – విఘ్నేష్‌ కాదు అనేదే ఇక్క లాజిక్‌. పెళ్లి ఖర్చు మొత్తం నెట్‌ఫ్లిక్స్‌ పెట్టుకుంది అని అంటున్నారు.

నయనతార – విఘ్నేశ్‌ శివన్‌ల పెళ్లి తమిళ, తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మొదట తిరులలో వివాహం చేసుకోవాలనుకున్న ఈ జంటకు అనుమతి లభించకపోవడంతో పెళ్లి వేదిక మహాబలిపురంలోని ఓ ప్రముఖ రిసార్ట్‌కు మారింది. అదే సమయంలో పెళ్లిని నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమ్‌ చేయడానికి అనువుగా ఉండటానికి వెన్యూ మార్చారు అని కూడా అన్నారు. తిరుమలలో పెళ్లి పెట్టుకుంటే షూటింగ్‌లు లాంటి హంగామాలు కుదరవు అనే విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు జరిగిన పెళ్లికి మొత్తం ఖర్చు నెట్‌ఫ్లిక్సే పెట్టిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వివాహం కోసం రూ.25 కోట్ల దాకా నెట్‌ఫ్లిక్స్‌ చెల్లించిందనే టాక్ నడుస్తోంది. ఆ పెళ్లి వేడుక తాలూకు డిజిటల్ హక్కులు తీసుకోవడం వల్లే అంతలా ఖర్చు పెట్టారని సమాచారం. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కాబోతోందని సమాచారం. అన్నట్లు ఈ పెళ్లి షూటింగ్‌ అంతా ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చేతుల మీదుగా సాగిందట.

పెళ్లి కోసం విందు దగ్గర నుండి అతిథులకు గదుల బుకింగ్ వరకు అంతా నెట్ ఫ్లిక్స్‌ వాళ్లే చూసుకున్నారని కోడంబాక్కం టాక్? వివాహం కోసం ఓ గ్లాస్ ప్యాలెస్‌ను కూడా నిర్మించారని పెళ్లికి వెళ్లిన వారు చెబుతున్నారట. విందులో ఒక్కో ప్లేటుకు సుమారు రూ.3500 వరకు పెట్టారని అంటున్నారు. మేకప్ ఆర్టిస్టులు, సెక్యూరిటీ సిబ్బందిని కూడా ముంబయి నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చారట. ఇంతలా చేయడం వల్లే పెళ్లి వేదిక నుండి ఒక్క ఫొటో కూడా లీక్‌ అవ్వలేదని టాక్‌. అయితే ఇవన్నీ నిజాలా కావా అనేది పెళ్లి స్ట్రీమింగ్‌ అయితే తేలిపోతుంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus