Surekha Vani: విరహవేదనతో సురేఖ వాణికి ప్రపోజ్ చేసిన నెటిజెన్..!

సీనియర్ నటి సురేఖ వాణి అంటే తెలియని వారుండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈ అమ్మడు.. అవకాశాలు తగ్గడంతో ఎక్కువగా సోషల్ మీడియాలోనే బిజీగా గడుపుతోంది. స్టార్ హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్ ఈమెకు సోషల్ మీడియాలో ఉంది. ఆమె ఏ ఫోటో పెట్టినా, ఏ వీడియో షేర్ చేసినా అది వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. అలాగే తన కూతురు సుప్రీతతో కలిసి ఏమే చేసే రీల్స్ కుడా చర్చనీయాంశం అవుతుంటాయి.

ఆ రీల్స్ చూస్తే ఇద్దరూ అక్కా చెల్లెళ్లన్నట్టు కనిపిస్తారు అనేది నెటిజన్ల ఫీలింగ్. తాజాగా (Surekha Vani) సురేఖ వాణి షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈమె విదేశాల్లో ఉంది. సిల్క్ శారీలో ఈమె రోడ్డు దాటుతున్నట్టు ఈ వీడియో ఉంది. ఆమె వాకింగ్ స్టైల్ చూసి ఆమె అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో రకరకాల కామెంట్స్ పెట్టి ఈ వీడియో వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

కొంతమంది ‘సూపర్’ అని, మరికొంతమంది మీ ఏజ్ 46 కాదు 16 అని.. ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం విరహవేదనకి గురయ్యి.. ‘మేడం నేను ఆగలేకపోతున్నాను. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి’ అంటూ కామెంట్ చేశాడు. ఏదైతేనేం సురేఖ వాణి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus