Varalakshmi: రాధిక విషయంలో వరలక్ష్మికి క్లాస్ పీకుతున్న నెటిజన్లు..!

సీనియర్ నటుడు శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో కూడా ఆయన బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఆయన కుమార్తె వరలక్ష్మి కూడా తెలుగులో స్టార్ డం సంపాదించుకుంది. తండ్రిని మించిన తనయగా వరలక్ష్మి తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. లేడీ విలన్ గా, సహాయ నటిగా ఈమె తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. వరలక్ష్మి ముక్కుసూటి మనిషి.ఏమున్నా.. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. అందుకే ఆమె పై విమర్శలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి.

తాజాగా శరత్ కుమార్ భార్య, ప్రముఖ నటి అయిన రాధిక 60 వ పుట్టినరోజు సందర్భంగా వరలక్ష్మీ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. “60వ జన్మదిన శుభాకాంక్షలు ఆంటీ.. లవ్ యూ.. మీరు మా అందరికీ ఆదర్శం. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అనేదానికి మీరే ప్రూఫ్. హుమ్మ.. హ్యావ్ యే గుడ్ ట్రిప్ ఆంటీ.. సీ యూ సూన్” అంటూ వరలక్ష్మి పోస్ట్ లో పేర్కొంది.

అంతే రాధికను.. ‘ఆంటీ’ అంటావేంటి?. అమ్మను ఆంటీ ఆనడం ఏంటి? అంటూ కొంతమంది నెటిజన్లు వరలక్ష్మి పై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. రాధిక… వరలక్ష్మికి సొంత తల్లి కాదు.ముందు నుండి ఆమెను ఆంటీ అనే పిలుస్తున్నట్లు ఆమె ఇది వరకే వివరించింది.’చాలా మంది రాధిక నా తల్లి అని అంటారు.

ఆమె నా తల్లి కాదు. ఆమె నా తండ్రికి రెండో భార్య. ముందు నుండి ఆమెను ఆంటీ అని పిలుస్తుంటాను.ఇలా పిలిచినంత మాత్రాన మా మధ్య గ్యాప్ ఉన్నట్లు కాదు. నా కన్న తల్లిని నేను అమ్మ అని పిలవాలి.’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus