సురేఖ వాణి ఫోటోల పై ఆంటీ కామెంట్ వైరల్

సురేఖావాణి… పరిచయం అవసరం లేని పేరు. మొగుడ్స్ పెళ్లామ్స్ అనే షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమై .. తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయ్యింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో అక్క, వదిన, పిన్ని, అత్త వంటి పాత్రలు పోషించింది. అయితే 2019 లో ఊహించని విధంగా ఈమె భర్త చనిపోవడంతో షాక్ కు గురై డిప్రెషన్ కు వెళ్ళిపోయింది. కొన్నాళ్ల తర్వాత తన కూతురి కోసం కోలుకుని..

తిరిగి మళ్ళీ మామూలు మనిషి అయ్యింది. ఇదిలా ఉండగా.. ఖాళీగా ఉన్న సమయంలో తన కూతురితో రీల్స్ వంటివి చేసి… సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఒక్క సినిమాలో కూడా నటించకపోయినా తన కూతుర్ని కూడా పాపులర్ అయిపోయేలా చేసింది. ప్రస్తుతం సురేఖ వాణి వయసు 45 ఏళ్ళు. అయినప్పటికీ ఆమె ఏజ్డ్ అన్నట్టు కనిపించదు. చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటుంది. సురేఖకు పెళ్లీడుకొచ్చిన కూతురు సుప్రీత ఉందంటే నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది.

సురేఖ వాణి సోషల్ మీడియా ఖాతాకి 6 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో ఆమె నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె గులాబీ కలర్ డ్రెస్ లో కొన్ని గ్లామర్ ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు తక్కువ టైంలోనే వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆంటీ అయిన ఓ నెటిజన్…

‘మీ గ్లామర్ ఫోటోలు చూసి ఇంట్లో నా భర్త కూడా మీలాగే రెడీ అవ్వమంటున్నాడు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఎమోజిని షేర్ చేసింది. ఈ కామెంట్ పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. సురేఖ వాణి ఫొటోలతో పాటు ఆ ఆంటీ పెట్టిన కామెంట్ పై కూడా ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus