Chiranjeevi: కొత్త లుక్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్న మెగాస్టార్.. ఎవరికీ సాధ్యం కాదంటూ?

  • October 7, 2023 / 01:32 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా చిరంజీవి కొనసాగారు. చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా ఉండి ఉంటే మరికొన్ని సంవత్సరాల పాటు చిరంజీవి నంబర్ వన్ హీరోగా కొనసాగేవారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి పారితోషికం ప్రస్తుతం 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. భోళా శంకర్ విషయంలో చిరంజీవి అంచనాలు తప్పాయనే సంగతి తెలిసిందే. చిరంజీవి వశిష్ట కాంబో మూవీ డిసెంబర్ నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది.

తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి కొత్త లుక్ ప్రేక్షకులు ఫిదా అయ్యేలా ఉండటంతో పాటు అదుర్స్ అనేలా ఉండటం గమనార్హం. తన కొత్త లుక్ తో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించారనే సంగతి తెలిసిందే. ఆరు పదుల వయస్సులో కూడా అదిరిపోయే లుక్స్ తో మెప్పించడం చిరంజీవికి మాత్రమే సాధ్యమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొన్నిరోజుల క్రితం చిరంజీవి మోకాలికి సంబంధించి మైనర్ సర్జరీ చేయించుకోగా ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫిజియోథెరపీ సెషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు చిరంజీవి ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇస్తూ తన లుక్ తో మెప్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. చాలామంది డైరెక్టర్లు చిరంజీవితో సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా ఆయా డైరెక్టర్లు తమ కథలతో చిరంజీవిని మెప్పించడంలో ఫెయిలవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

చిరంజీవి (Chiranjeevi) నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్లకు చిరంజీవి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. చిరంజీవిని అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus