బాలయ్య ‘రూలర్’ పోస్టర్ పై ఘోరమైన ట్రోలింగ్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆ వార్తలనే నిజం చేస్తూ.. ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ తో ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో బాలయ్య, కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘జై సింహా’ సినిమా హిట్ అవ్వడంతో ‘రూలర్’ పై కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అంతా బానే ఉంది కానీ.. ఈ పోస్టర్ పై మాత్రం చాలా తేడాగా ఉందనే చెప్పాలి.

ఈ పోస్టర్లో.. పోలీస్ డ్రెస్ లో ఓ పెద్ద సుత్తి పట్టుకుని.. ఎంతో కోపంతో నిలుచున్నాడు బాలయ్య. ఈ క్యారెక్టర్ పేరు ‘ధర్మ’ అట. అయితే ఈ లుక్ పై అభిమానులు కూడా ఎంతో అసంతృప్తితో ఉన్నారు. ఈ లుక్ చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ‘లుక్ రిలీజ్ చేసే ముందు కనీసం చెక్ చేసుకోరా’ అంటూ చిత్ర యూనిట్ పై మండిపడుతున్నారు అభిమానులు. ‘సరిగ్గా చూపించడం రాకపోతే’ ‘కావాలనే ఇలాంటి పోస్టర్లు వదులుతున్నారా..?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. a

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus