“మహానటి” సినిమా విడుదలైనప్పట్నుంచి మంచో చెడో.. ఏదో ఒక విధంగా వార్తల్లో నిలిస్తూనే ఉంది. అయితే.. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “మహానటి” చిత్రానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది మరోమారు కాంట్రవర్సీకి దారి తీసింది. అందుకు కారణం లేకపోలేదు.. పాపం గుణశేఖర్ అప్పట్లో ఏళ్లతరబడి శ్రమించి రుద్రమదేవి జీవితం ఆధారంగా సినిమాను భారీ క్యాస్టింగ్, గ్రాఫిక్స్ తో తెరకెక్కించి ప్రభుత్వాన్ని తానే స్వయంగా అడిగినప్పటికీ పట్టించుకొన్న నాధుడు లేదు. అలాంటిది అడగకపోయినా ఇప్పుడు “మహానటి” చిత్రానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది చర్చనీయాసంగా మారింది.
ఇదివరకూ కూడా గుణశేఖర్ పలు సినిమాల విషయంలో ఈ తరహాలో స్పందించాడు. “గౌతమీపుత్ర శాతకర్ణి”కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం విషయంలోనూ గుణశేఖర్ ప్రభుత్వాన్ని ప్రశించారు. అయితే.. ఇప్పుడు “మహానటి” విషయంలో ఆయన డైరెక్ట్ గా స్పందించకపోయినా.. ప్రభుత్వం ఎందుకని “రుద్రమదేవి” సినిమాని కనికరించడం లేదు అనే విషయంపై ఇప్పటికీ ఫిలిమ్ నగర్ లో చర్చించుకొంటూనే ఉంటారు.