NTR30: కొరటాల సినిమా విషయంలో ఎందుకింత ఆలస్యం!

ఎన్టీఆర్‌ సినిమా త్వరలో ప్రారంభం అని దర్శకుడు కొరటాల శివ చెప్పి.. సుమారు 10 నెలలు అవుతోంది. మామూలుగా అయితే ఆయన చెప్పిన స్పీడ్‌కి ఈ పాటికి సినిమా రిలీజ్‌ అయిపోయి ఉండాలి. ఆ లెక్కల గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మనం ఇంకా ఆ సినిమా షూట్‌ ఎప్పుడు స్టార్ట్‌ అని అడిగే స్టేజ్‌లోనే ఉన్నాం ఇంకా. ఈ క్రమంలో చాలా రోజులుగా సినిమా మొదలవ్వకుండా.. నానుతూనే ఉంది. ఇలా సినిమా ఆలస్యం అవ్వడం వెనుక హీరోయిన్‌ ఎంపిక పూర్తి కాకపోవడం కూడా ఓ కారణం అని అంటున్నారు.

నిజానికి తారక్ సినిమా స్టార్టింగ్‌ అనే మాట వచ్చినప్పుడల్లా వినిపించే హీరోయిన్ల పేర్లలో పరిణీతి చోప్రా, జాన్వీ కపూర్‌ కచ్చితంగా ఉంటాయి. అలా ఈ సినిమా గురించి కూడా ఆ పేర్లు వినిపించాయి. అయితే ఈసారి కొత్తగా ఆలియా భట్‌ పేరు కూడా వచ్చింది. ఆమె కూడా మ్యాగ్జిమమ్‌ ఓకే అంది కూడా. అయితే ఇంతలో ఆమె సినిమా నుండి తప్పుకుంది. దీంతో అప్పటి నుండి చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో హీరోయిన్‌ పేరు ఈ జాబితాలోకి వచ్చింది. ఆమెనే ‘సీతారామం’ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.

‘సీతారామం’ సినిమాలో సీతా మహాలక్ష్మిగా మెప్పించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది మృణాల్ ఠాకూర్. అందులో పద్ధతిగా చీరకట్టులో కనిపించినా.. ఆమెలో గ్లామర్‌ టచ్‌ బాగానే ఉంది. స్కిన్‌ షో, ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌కి ఏ మాత్రం అడ్డుచెప్పదు కూడా. అందుకే ఎన్టీఆర్‌ సినిమాకు ఆమెను కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ ఇస్తారు అని చెబుతున్నారు. దానికితోడు నటనకు ప్రాధాన్యమున్న హీరోయిన్‌ పాత్ర ఈ సినిమాలో ఉంది అని కూడా ఆ మధ్య వార్తలొచ్చాయి.

అలాంటి పాత్రలు ఆమెకు కొట్టిన పిండి అని కూడా అంటారు. ‘జనతా గ్యారేజ్’ లాంటి సూపర్ హిట్ సినిమా తరవాత ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. అనిరుధ్ స్వరాలందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ డిస్కషన్స్ ఇటీవల పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం అని అంటున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus