Devara: తారక్‌ ‘దేవర’ రిలీజ్‌ డేట్‌ మారింది? ఇక ఉరుకులు, పరుగులే!

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఫ్యాన్స్‌కి నిరాశ, తారక్‌ ఫ్యాన్స్‌కి ఎనర్జీనిచ్చే ఓ వార్తను తీసుకొచ్చాం. పవన్‌ అభిమానుల మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా ‘ఓజీ’ (OG Movie) రిలీజ్‌ డేట్‌ మారింది. అదే సమయంలో తారక్‌ (Jr NTR) ‘దేవర’ (Devara) రిలీజ్‌ కూడా కూడా మారింది. అయితే కాస్త ముందుకొచ్చింది. ప్ర‌పంచవ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మేరకు టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను రెండు వారాలు ప్రీపోన్‌ చేశారు.

గురువారం సినిమా యూనిట్ ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ‘దేవరలోని తొలి పార్టను సెప్టెంబ‌ర్ 27న తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదల చేయబోతున్నారు. ఆ రోజున నిజానికి పవన్‌ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా రావాల్సి ఉంది. అయితే పవన్‌ ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతున్న నేపథ్యంలో ఆ రోజుకు సినిమా పూర్తయ్యే అవకాశం లేదని టాక్‌. దీంతో సినిమా వాయిదా పడుతుంది అన్నారు.

ఇప్పుడు ఆ సినిమా సంగతి చెప్పలేదు కానీ.. ‘దేవర’ సినిమాను ప్రీపోన్‌ చేశారు. రెండు పెద్ద హీరోల సినిమాలు ఆ రోజుకు రావడం కష్టం, అసాధ్యం కాబట్టి ‘ఓజీ’ స్థానంలో ‘దేవర’ రాక పక్కా అవ్వడంతో ‘ఓజీ’ రాక ఇప్పుడు లేదు అని తేలిపోయింది. అయితే ఎప్పుడు అనేది ఆ సినిమా టీమ్‌ చెబుతుంది అని అంటున్నారు. దీంతో ఆ డేట్‌ను ఇప్పటికే చెప్పిన సినిమాలు వాయిదాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ అండ్‌ టీమ్‌ సినిమా షూటింగ్‌ను ఉరుకులు, పరుగులు పెట్టి పూర్తి చేయాల్సిందే.

జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేశాడని, త్రిపాత్రాభినయం చేశాడని వార్తలొచ్చాయి. అయితే వాటిలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇక నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ మీద మిక్కిలినేని సుధాక‌ర్‌ (Sudhakar Mikkilineni), హ‌రికృష్ణ‌.కె (Kosaraju Harikrishna) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus