Mahesh Babu, Trivikram: త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ పాటిస్తారా?

ఈ మధ్య కాలంలో స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబోలో సినిమా ఫిక్స్ కాగానే సినిమా టైటిల్ కు సంబంధించి, సినిమాలో నటించే హీరోయిన్ల గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ ఫిక్స్ అయిన సమయంలో ఆ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు, చౌడప్ప నాయుడు టైటిల్స్ వినిపించాయి. అయితే ఊహించని విధంగా ఆ సినిమా షూటింగ్ మొదలుకాకుండానే ఆగిపోయింది. మరోవైపు మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి పార్థు, అతడే పార్థు అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.

మొదట పార్థు అనే టైటిల్ ప్రచారంలోకి రాగా త్రివిక్రమ్ ప్రతి సినిమా టైటిల్ అ అనే అక్షరంతో మొదలవుతుంది కాబట్టి ఈ సినిమాకు అతడే పార్థు అనే టైటిల్ ఫిక్స్ కావచ్చని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు పని చేస్తున్న యూనిట్ సభ్యుల్లో ఒకరు అతడు సినిమాకు మహేష్ త్రివిక్రమ్ కొత్త సినిమాకు ఏ మాత్రం సంబంధం లేదని చెబుతున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమాకు కొత్త టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ టైటిల్ విషయంలో అ సెంటిమెంట్ ను పాటిస్తారో లేదో చూడాల్సి ఉంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ప్రభాస్ నటిస్తున్న సలార్, ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కానున్న నేపథ్యంలో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ మేలో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus