Salaar: ప్రభాస్ సినిమాకు సీడెడ్ ఏరియాలో వింత సమస్య.. ఏం జరిగిందంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ ట్రైలర్ ఆగష్టు నెలలోనే రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించినా ఈ సినిమా ట్రైలర్ ఈ నెలలో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. సలార్ మూవీ నైజాం హక్కులు దిల్ రాజు సొంతం చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే సీడెడ్ హక్కుల విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం. 27 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమా హక్కులను అమ్మాలని మేకర్స్ భావిస్తుండగా ఆ రేంజ్ లో ఈ సినిమాకు కలెక్షన్లు రావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సీడెడ్ లో ఈ సినిమా హక్కుల కోసం ఆ రేంజ్ లో ఖర్చు చేయడానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరని సమాచారం. ఈ రీజన్ వల్లే సలార్ సీడెడ్ డీల్ కు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభాస్ సినిమాకు సీడెడ్ ఏరియాలో వింత సమస్య ఎదురైన నేపథ్యంలో సీడెడ్ లో ఈ సినిమా హక్కులను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. సలార్ సినిమా సెప్టెంబర్ నెల బాక్సాఫీస్ విజేతగా నిలవడంతో పాటు బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సలార్, సలార్2 సినిమాల కలెక్షన్లు రికార్డ్ రేంజ్ లో ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాకు యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలవనుండగా ఈ సినిమాలో సాంగ్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదని తెలుస్తోంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సలార్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus