టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీలో సరైన సక్సెస్ దక్కితే ఇప్పటికీ సీనియర్ హీరోల సినిమాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. అయితే సీనియర్ స్టార్స్ కు వార్నింగ్స్ బెల్స్ మొదలయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ (Rajinikanth) జైలర్ (Jailer) సినిమాతో సక్సెస్ సాధించిన లాల్ సలామ్ (Lal Salaam) సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ (Kamal Haasan) విక్రమ్ (Vikram) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించగా ఇండియన్2 (Indian 2) సినిమాతో కమల్ హాసన్ ఎలాంటి ఫలితాన్ని అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సీనియర్ హీరోల సినిమాలు యునానిమస్ హిట్ టాక్ వస్తే అద్భుతాలు చేస్తున్నా నెగిటివ్ టాక్ వస్తే నిర్మాతలను నిలువునా ముంచేస్తున్నాయని నెటిజన్ల కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే నిర్మాతలకు లాభాలను అందిస్తున్న నేపథ్యంలో సీనియర్ హీరోలు కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది హీరోల పరిస్థితి ఇలాగే ఉందని చెప్పవచ్చు. ఆసక్తికర కథనం లేని సినిమాలను ఎంచుకుంటే హీరోల కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. సీనియర్ హీరోల రెమ్యునరేషన్లు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఇతర భాషల్లో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
సీనియర్ హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. సీనియర్ హీరోలు యంగ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు. సీనియర్ హీరోల సినిమాల బడ్జెట్లు సైతం గతంతో పోలిస్తే పెరిగాయని సమాచారం అందుతోంది.