ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏంటంటే.. సమంత, నాగచైతన్యల ప్రేమ వ్యవహారమే.. వీరిద్దరికి ఎప్పటినుండో రిలేషన్ ఉంది. అయితే ఈ విషయం రీసెంట్ గానే అందరికీ తెలిసింది. ఇద్దరు చెట్టపట్టాలేసుకొని తిరుగుతూ మీడియాకు చాలా సార్లు చిక్కారు. చైతు తండ్రి నాగార్జునకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేక, వారి ప్రేమకు అడ్డంగా మారారు.
చైతు మొండిపట్టు పట్టడంతో చేసేదేమీ లేక వారి పెళ్ళికి అంగీకరించారు. వచ్చే నెలలోనే నిశ్చితార్ధం చేసుకొని.. డిసంబర్ నెలలో పెళ్లి అనుకుంటున్న ఈ సమయంలో సమంత ఓ ట్విస్ట్ ఇచ్చింది. తనకు అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని ఓ ఏడాది కాలం పాటు సింగిల్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ఓ మీడియా ప్రతినిధికి సంకేతాలు పంపించినట్లుగా వినికిడి. ప్రేమ, పెళ్లి అంటూ అందరికీ షాక్ ఇచ్చిన సామ్ అప్పుడే పెళ్ళికి సిద్ధంగా లేనని మరో ట్విస్ట్ ఇచ్చింది. వీరి ప్రేమ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి..!