సినిమా అనౌన్స్‌మెంట్‌లో కొత్త స్టయిల్‌.. ఇంకెన్ని సినిమాలు ఇలా వస్తాయో!

ఎంత కష్టపడి సినిమా తీస్తున్నామో.. అంతకుమించి ప్రచారం చేయాలి. లేదంటే కష్టపడిందంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే నేటి దర్శకులు, నిర్మాతలు తమ సినిమాకు వినూత్నమైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సినిమా అనౌన్స్‌మెంట్‌కి ట్రైలర్‌, టీజర్‌ తరహాలో వీడియోలు రూపొందిస్తున్నారు. ఇలా నిన్న ‘జైలర్‌ 2’ వీడియో రాగా.. ఈ రోజు ‘90s’ టీమ్‌ వీడియో ఇంకొకటి వచ్చింది.

సినిమా ఎలా ఉండబోతోంది, కథ ఎలా ఉండబోతోంది, ఏం చెప్పబోతున్నారు, ఏం చూపించబోతున్నారు అంటూ ఓ వీడియోను సిద్ధం చేసి విడుదల చేయడం కొత్త ట్రెండ్‌. ఇన్నాళ్లూ సినిమా అనౌన్స్‌మెంట్‌ అంటే పోస్టరో, టైటిలో ఇవ్వడం చూశాం. ఇప్పుడు ‘జైలర్‌ 2’తో అవన్నీ పాతవి.. కొత్త ప్రయోగం వర్త్‌ వర్మ అంటూ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ చూపించారు. ‘జైలర్‌’ తరహాలోనే ‘జైలర్‌ 2’ ఉంటుంది.. కాస్త అప్‌డేటెట్‌గా అని చూపిచారు.

ఇక ‘90s’ వెబ్‌సిరీస్‌తో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్‌ తొలి సినిమాను ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యతో చేస్తారు అంటూ చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై ఆ సినిమాను ఈ రోజు అనౌన్స్‌ చేశారు. ఈ సినిమాను కూడా కాన్సెప్ట్ తరహాలోనే అనౌన్స్‌ చేశారు. ‘90s’ సినిమాలోని ప్రధాన పాత్రలను తీసుకొని ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు వివరంగా చూపించారు.

ఇలాంటి వీడియోలు మనకు కొత్త కానీ తమిళనాట నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ చాలా ఏళ్లుగా చేస్తూనే ఉన్నారు. తొలి సినిమా నుండి పాటలకు సంబంధించిన సమాచారాన్ని ఈ తరహాలోనే స్పెషల్‌ వీడియోలు సిద్ధం చేసి పాఠకులకు పరిచయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా సినిమానే అలా పరిచయం చేశారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం అనిల్‌ రావిపూడి కూడా ఇలానే ట్రై చేశారు. ప్రచారం కొత్త పుంతలు తొక్కడం అంటే ఇదేమరి.

సీనియర్ స్టార్ హీరోల పల్స్ పట్టేసిన స్టార్ డైరెక్టర్స్ వీళ్ళే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus