Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Advertisement

ఒక సినిమాకు గుమ్మడి కాయ కొట్టడం.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టడం.. గత కొన్నేళ్లుగా నందమూరి బాలకృష్ణ సినిమాల వరుస ఇలానే కొనసాగుతోంది. అంతలా ప్లానింగ్‌ చేసుకునేవారు ఆయన. అయితే ‘అఖండ 2: తాండవం’ సినిమా తర్వాత పరిస్థితి మారిపోయినట్లు అనిపిస్తున్నాయి. అంతా ఓకే అయిపోయింది.. త్వరలో ముహూర్తం అని వార్తలొచ్చిన సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పనులు మొదలవ్వలేదు. రేపు, మాపు అంటున్నారు కానీ స్టార్ట్‌ అవ్వడం లేదు. ఇప్పుడు ఓకే అయింది అనుకున్న ఇంకో సినిమా డౌట్‌లో పడింది.

Balayya – Vijay

గోపీచంద్‌ మలినేని సినిమా ఈ నెలలో స్టార్ట్‌ అవుతుంది అని ఓ గుడ్‌ న్యూస్‌ బయటకు వచ్చిన సమయంలోనే.. ఆయనకు మరో యువ దర్శకుడు కథ చెప్పారని, బాలకృష్ణ కూడా ఆ కథ విషయంలో ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ‘నాంది’ సినిమాతో వైవిధ్యమైన ఆలోచనలు ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌ కనకమేడల ఇటీవల బాలయ్యను కలసి ఓ కథ లైన్‌ వినిపించారని సమాచారం. ఓ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ నేపథ్యంలో ఆ సినిమా సాగుతుందని సమాచారం. బాలయ్యకు ఈ కథ నప్పుతుందని భోగట్టా.

మాస్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ శిష్యుడిగా విజయ్‌ కనకమేడలకు పేరు. వారిద్దరి కాంబినేషన్‌లో మంచి హిట్‌ సినిమాలు కూడా వచ్చాయి. గత కొన్ని నెలలుగా బాలయ్య – హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి. అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారు అనే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆయన కాకుండా ఆయన శిష్యుడు సినిమా చేస్తారు అని వార్తలు వస్తుండటం గమనార్హం. మరి గురువు కంటే ముందు శిష్యుడు బాలయ్యతో సినిమా చేస్తారేమో చూడాలి.

ఇదిలా ఉండగా బాలయ్యతో సినిమా చేస్తారు అంటూ యువ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ పేరు కూడా వినిపించింది. ఆయనో కథ చెప్పారు అని కూడా అన్నారు. మరిప్పుడు విజయ్‌ కనకమేడల సినిమా ఓకే అయితే వివేక్‌ ఆత్రేయ సినిమా దాదాపు లేనట్లే. మరీ రెండు కథలు నచ్చితే బాలయ్య రెండూ ఒకేసారి చేసినా చేయొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus