తమన్నా,సందీప్ కిషన్ ల ‘నెక్స్ట్ ఏంటి’ ట్రైలర్ లాంచ్ వేడుక..!!

తమన్నా,సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నెక్స్ట్ ఏంటి’.. బాలీవుడ్ టాప్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవదీప్, పూనమ్ కౌర్ లు ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, ఇటీవలే ఫస్ట్ లుక్ ని, టీజర్ ని రిలీజ్ చేసారు.. టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగ తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు..ఈ కార్యక్రమం హైదరాబాద్ లో జరగగా దర్శకుడు కునాల్ కోహ్లీ, సందీప్ కిషన్, నవదీప్, తమన్నా , సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ తదితరులు హాజరయ్యారు..

ఈ సందర్భంగా దర్శకుడు కునాల్ కోహ్లీ మాట్లాడుతూ.. ఈ సినిమా స్క్రిప్ట్ ను ఫస్ట్ నేను శరత్ బాబు గారికి పంపాను అయన ఎంతో థ్రిల్ గా ఫీల్ అయ్యి నన్ను హైదరాబాద్ కి రమ్మన్నారు.. ఫాదర్ అండ్ డాటర్ మధ్య సీన్స్ చాల బాగున్నాయన్నారు.. ఇండియాన్ కల్చర్ ని తెలిపే సినిమా ఇది.. ఒక సినిమా కి భాష ఇబ్బంది కాదు.. ఏ భాషలోనైనా సినిమా బాగుంటే ఆడుతుంది.. అన్నారు..

హీరో నవదీప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినందుకు కునాల్ గారికి చాల థాంక్స్.. ఈ సినిమాలో తమన్నా డబ్బింగ్ బాగుంది.. తన హార్డ్ వర్క్ చాల బాగుంది.. సందీప్ చాల బాగా యాక్ట్ చేసాడు.. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.. సినిమా ట్రైలర్ లో ఉన్న కంటెంట్ వేరు సినిమాలో ఉన్న ఫీల్ వేరు.. యూత్ ని ఆకట్టుకోవాలని అలా ట్రైలర్ కట్ చేసారు.. ఈ సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను..

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ముందుగా కునాల్ గారు దర్శకుడు అనగానే బాలీవుడ్ సినిమా అనుకున్నాను.. కానీ తర్వాత తెలిసింది తెలుగు సినిమా అని.. కథ వినగానే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది..సినిమా లోని నా లుక్ చాల బాగుంది.. కునాల్ గారు నన్ను హీరో గా తీసుకున్నందుకు చాల థాంక్స్.. నా పాత్ర బాగుందంటే అది కునాల్ క్రెడిట్.. మ్యూజిక్ చాల బాగుంది.. నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ లో నాకు చాల బాగా నచ్చిన ప్రొడ్యూసర్ కిరణ్ గారు.. ఆ తర్వాత నేను బాగా కంఫర్ట్ ఫీల్ అయిన ప్రొడ్యూసర్స్ అక్షయ్ గారు… తమన్నా తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది.. అన్నారు..

హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. తెలుగు సినిమా రోజు రోజు కి చేంజ్ అయిపోతుంది.. ఈ సినిమాలు ఇండియా మొత్తం తెలిసిపోతున్నాయి.. నేను ముంబై లో పుట్టినా తెలుగు సినిమా నాకు చాల ముఖ్యం.. కునాల్ గారికి బిగ్ వెల్ కం… మీరు మీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను.. సూపర్ హిట్స్ చేయాలనీ కోరుకుంటున్నాను..నెక్స్ట్ ఏంటి సినిమా కథ విన్నప్పుడు చాల ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.. ఇందులో నా క్యారెక్టర్ నేనే ప్లే చేస్తున్నానా అనిపించింది..సందీప్ తో యాక్ట్ చేయడం చాల బాగా అనిపించింది..నవదీప్ కళ్ళతో నటించే యాక్టర్..వారితో పనిచేయడం కొత్తగా అనిపించింది.. సినిమా మొత్తం చాల ఎంజాయ్ చేస్తూ చేసాం.. డిసెంబర్ లో ఈ సినిమా వస్తుంది.. మీ అందరు తప్పక ఆదరించాలి అన్నారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus