Nidhhi Agerwal: తన కామెంట్స్ తో ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిన నిధి..!

  • July 26, 2021 / 03:47 PM IST

నిధి అగర్వాల్ చేసినవి తక్కువ సినిమాలే అయినా…స్టార్ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ‘సవ్యసాచి’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అటు తర్వాత ‘మిస్టర్ మజ్ను’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాల్లో నటించింది. తమిళంలో కూడా భూమి, ఈశ్వరన్ వంటి హిట్ సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’

అలాగే మహేష్ బాబు మేనల్లుడు హీరోగా తెరకెక్కుతున్న ‘హీరో’ వంటి చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతుంది.ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఆమె అభిమానులను డిజప్పాయింట్ చేశాయనే చెప్పాలి. మేటర్ ఏంటంటే గ్లామర్ షో చేయడానికి నిధి ఏమాత్రం తగ్గదు. అలాగే ముద్దు సీన్లలో కూడా ఈ అమ్మడు ఎంతో యాక్టివ్ నటిస్తుంది. దీంతో వాన పాటల్లో కూడా ఈమె నర్తిస్తే కచ్చితంగా ఈమె స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని ఆమె అభిమానులు భావించారు.

కానీ ఈ విషయంలో నిధి వాళ్ళకి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ‘వాన పాటలంటే నాకు చాలా చిరాకు. వానలో తడవడం, బట్టలు ఆరబెట్టుకోవడం, మళ్ళీ తడవడం… చాలా చిరాగ్గా అనిపిస్తుంది. వాన పాట షూటింగ్ అంటే నరకమే..!’ అంటూ ఈ అమ్మడు దర్శక నిర్మాతలకి చెప్పుకొచ్చిందట.అంతేకాదు ‘ఇప్పట్లో తన కోసం అలాంటి పాటలు కూడా ప్లాన్ చేయొద్దని’ తెగేసి చెప్పేసిందట నిధి అగర్వాల్.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus